నో డౌట్.. రాజకీయంగా టీఆర్‌ఎస్ నేత, తెలంగాణ మంత్రి హరీష్‌రావుకి డ్యామేజీ జరుగుతోంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. 'టీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు అసంతృప్తితో వున్నారు.. అటు పార్టీ పరంగానే కాదు, ఇటు ప్రభుత్వంలోనూ హరీష్‌రావుకి అన్యాయం జరుగుతోంది.. ఆయన్ని తొక్కేస్తున్నారు..' అంటూ వస్తోన్న గాసిప్స్‌లో నిజమెంతోగానీ, ఈ గాసిప్స్ పుణ్యమా అని హరీష్ ఇమేజ్ బాగానే డ్యామేజీ అవుతోందట. ఈ విషయాన్ని స్వయంగా హరీష్‌రావు, తన సన్నిహితుల వద్ద చెప్పుకుని వాపోతున్నారంటూ సరికొత్తగా గాసిప్స్ షురూ అయ్యాయి.
నిప్పు లేకుండానే పొగ పుట్టదు.. అన్న మాట మామూలుగానే వింటుంటాం. కానీ, రాజకీయాల్లో పొగ పుట్టాలంటే నిప్పు అవసరం లేదు. ఏమీ లేని చోట పొగ పుట్టడం, ఆ తర్వాత నిప్పు పుట్టడం, భగ్గుమనడం.. ఇలా అంతా రివర్స్‌లో జరిగిపోతుంటుంది. హరీష్‌రావు విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ, హరీష్‌రావు మీద చాలా మమకారం చూపించేయడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు, హరీష్ విషయంలో అనుమానాలు పెంచుకోవడం సహజమే.!
ఇంకోపక్క, వరంగల్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లలో హరీష్‌రావు నిమగ్నమై వుంటే, పొలిటికల్‌గా ఆయన ఇమేజ్‌కి డ్యామేజీ కొట్టే పనిలో.. టీఆర్‌ఎస్‌లోని ఆయన వ్యతిరేక వర్గం చాలా బిజీగా వుందట. జరుగుతున్న డ్యామేజీ ఏ స్థాయిలో వుందో, వరంగల్ బహిరంగ సభ తర్వాత కొద్ది రోజుల్లోనే హరీష్‌రావుకి తెలియనుందట. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తర్వాత అంతటి ఫాలోయింగ్ వున్న మాస్ లీడర్ హరీష్‌రావు.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, రోజులెప్పుడూ ఒకేలా వుండవు కదా.!