చరణ్ సౌత్ సూపర్ స్టార్ అని తెలియదట

రామ్ చరణ్..మగధీర రికార్డు తరువాత సరైన రికార్డు సెట్ చేయలేకపోతున్నాడు. మరో మెగా హీరో బన్నీ దూసుకుపోతున్నాడు. మొన్నటికి మొన్న టాప్ ఫైవ్ లో మగధీరను సరైనోడుతో క్రాస్ చేసినా, బాగుండదని మళ్లీ పెద్దగా పబ్లిసిటీ చేయడం ఆపేసారు. ఇప్పుడు కాశ్మీర్ షూట్ నుంచి తిరిగి వచ్చాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఓ ప్రెస్ నోట్ వదిలారు. 

విదేశాల్లో కూడా చరణ్ కు విపరీతమైన ఫాలోయింగ్ వుందంటూ పేర్కొన్నారు. ముఖ్యంగా జపాన్ లో, అరబీస్ లో, ఈస్ట్ ఆసియన్ లో అంటూ. అసలు ముందు ఇక్కడ మంచి రికార్డలు సెట్ చేయాలి కదా.. కొత్త రికార్డులు సృష్టించాలి కదా.. సౌత్ సూపర్ స్టార్ అంటే ఆ రేంజ్ క్రేజ్ వున్నట్లే కదా.. కొత్తగా ఇధంతా చెప్పడం దేనికి? అనవసరంగా వేరే ఫ్యాన్స్ సెటైర్ లు వేసుకోవడానికి ఆస్కారం ఇవ్వడానికి కానీ, ఇలాంటి నోట్ ఎందుకో? 

చరణ్ కాశ్మీర్ షూట్ ముగించుకు వచ్చారు.. సినిమా బాగావస్తోంది.. దానిపై మంచి అంచనాలు వున్నాయి.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.. ఇలా రాసుకుంటే బెటర్ కదా?

Show comments