కదిరేశన్ ఫుల్ కాన్ఫిడెన్స్.. ధనుష్ కథ క్లైమాక్స్ కు!

ధనుష్ మా అబ్బాయి.. మా కొడుకు.. అని వాళ్లు అంటున్నారు. కాదు.. వాళ్ల వెర్షన్ అబద్ధమని అతడు అంటున్నాడు.. వివాదం కోర్టుకు ఎక్కింది. మరి ఇప్పుడు తను వాళ్ల కొడుకును కాదు అని అంటున్న ధనుష్ దాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. సైన్స్ ను ఉపయోగించుకుని.. ఈ వివాదం నుంచి అతడు బయటపడటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వారిది తప్పుడు అభియోగం అని అంటున్న ధనుష్ ధైర్యంగా వ్యవహరించడం లేదు కానీ, కదిరేశన్ దంపతులు మాత్రం చాలా ధైర్యంగా వ్యవహరిస్తున్నారు. ధనుష్ ను తమ తనయుడిగా నిరూపించేందుకు దేనికైనా సిద్ధం అంటున్నారు. ఏకంగా డీఎన్ఏ టెస్టు నిర్వహించాలని కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు కదిరేశన్ దంపతులు! డీఎన్ఏ టెస్టు చేస్తే.. ధనుష్ వారి తనయుడా కాదా అనే అంశం ఇట్టే బయటపడిపోతుంది. తేల్చేద్దాం.. అని కదిరేశన్ దంపతులు అంటుంటే, ధనుష్ మాత్రం తప్పించుకోవాలని చూస్తున్నాడు. డీఎన్ఏ టెస్టు వద్దు అనేది ధనుష్ వాదన! నిజంగా కదిరేశన్ దంపతులది నాన్సెన్సికల్ వాదన అయితే.. ఈ తలనొప్పిని వదిలించుకోవడానికి ధనుష్ కు డీఎన్ఏ టెస్టు ఒక ఉత్తమమైన మార్గం. చాలా త్వరగా చిక్కుముడి విడిపోతోంది.

తను వారి తనయుడిని కాదని తేలితే.. వాళ్లతో ధనుష్ ఆటాడుకోవచ్చు. ఇన్ని రోజులూ చేసిన అతినంతా గుర్తు చేస్తూ కోర్టులో పరువు నష్టం దావా వేశాడంటే.. కదిరేశన్ దంపతులు ఊచలు లెక్కబెట్టాల్సి రావొచ్చు. మరి అంత అవకాశం ఉన్నా ధనుష్ మాత్రం.. ‘అబ్బే డీఎన్ఏ టెస్టు నా పరువుకు భంగం.. అది నాకు ఇష్టం లేదు..’ అని అంటున్నాడు. కానీ ఈ చిత్రవిచిత్రమైన కేసు ఇంత వరకూ వచ్చిందంటే.. కదిరేశన్ దంపతులు ఇన్ని రోజుల పాటు కోర్టు ముందు నిలబడగలిగారంటే.. సమ్ థింగ్ ఈజ్ దేర్ అనే అనిపిస్తుంది. మొన్నామధ్య తమిళనాడులోనే జయలలిత, శోభన్ బాబుల కొడుకుని అంటూ ఒకడు కోర్టుకు ఎక్కాడు. తప్పుడు ఆధారాలతో కోర్టుకు ఎక్కిన అతడు నిమిషాల మీద పట్టుబడ్డాడు. మరి కదిరేశన్ దంపతులు మాత్రం నెలల తరబడి పోరాడుతున్నారు.

ఆఖరికి ఈ వ్యవహారంలో ఏదో ఒకటి తేల్చాలని డీఎన్ఏ టెస్టు కు పిటిషన్ కూడా వాళ్లే వేశారంటే.. వారి కాన్ఫిడెన్స్ లెవల్ ఏమిటో అర్థం చేసుకోవాలి. అర్రీబుర్రీగాళ్లైతే.. డీఎన్ఏ టెస్టు చేయించండి.. అనే మాట కూడా ఎత్తలేరు. వాళ్లు ఏకంగా పిటిషనే వేసేవారు. చిక్కుముడిని విప్పేయమంటున్నారు. అయితే ధనుషే ఇప్పుడు పారిపోతున్నాడు. ఆల్రెడీ మచ్చల పరీక్షలో ధనుష్ కు వ్యతిరేకంగా నివేదికను ఇచ్చారు డాక్లర్టు. అతడు మచ్చలను చెరిపేయించుకున్నాడని వారు తేల్చారు. మరి డీఎన్ఏ అంటే.. అస్సలు వద్దని ధనుష్ అంటున్నాడు. మరేంటో కథ.. ఇప్పటి వరకూ కేసు నడిచిన తీరును చూస్తే, కదిరేశన్ దంపతులు కోరినట్టుగా డీఎన్ఏ టెస్టుకు కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు కూడా. దీంతో కథ క్లైమాక్స్ కు వచ్చినట్టే!

Show comments