సంపూ కష్టపడ్డాడుగానీ...

'హృదయకాలేయం' ప్రమోషన్స్‌ చూసి, అబ్బే ఇదేం సినిమా అన్నారు కొంతమంది. చాలామంది ఈ సినిమాకి అడిక్ట్‌ అయిపోయారు. సినిమాలో ఏదో మ్యాజిక్‌ అలా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసేసింది. 'ఫూలిష్‌ మూవీ..' అన్పించినాసరే, అందులో కామెడీకి పడీ పడీ చచ్చారు జనం. నిజమే, అదో టైపు కామెడీ. చెత్తలా వుందని తిట్టుకుంటూనే సినిమాని ఎంజాయ్‌ చేసేశారు. అలా 'హృదయకాలేయం' సినిమా పెద్ద హిట్టయి కూర్చుంది. బర్నింగ్‌ స్టార్‌ సంపూ రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయాడు. 

ఇప్పుడు తాజాగా 'కొబ్బరిమట్ట' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్న సంపూ, మళ్ళీ పాత పబ్లిసిటీ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సాంగ్‌ ప్రోమో ఒకటి సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. 'శంబో శివశంభో..' అంటూ సాగే ఆ పాటలో సంపూ చేసిన 'ఫీట్లు' (డాన్స్‌ అనకూడదు మరి) ఓ రేంజ్‌లో వున్నాయి. ఫీట్స్ అయితేనేం.. సంపూ కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపించింది. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, సినిమా చూశాక ఖచ్చితంగా నవ్వుకుంటారు.. సినిమాకి కాసుల పంట పండుతుంది.. అన్నది బహుశా సంపూ స్ట్రాటజీ అయి వుంటుంది. 

మొత్తమ్మీద సంపూర్ణేష్‌బాబు ఓ వెరైటీ హీరో. 'హృదయకాలేయం' తరహాలో 'కొబ్బరిమట్ట' కూడా సంచలనాలకు తెరలేపుతుందా.? వేచి చూడాల్సిందే.

Show comments