తలసాని హూంకరింపులు బేఖాతర్

కాంబో ఆఫర్లు, ఎక్కువ రేట్లు పెడితే చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని హూంకరించారు. కానీ జరుగుతున్నది వేరుగావుంది. పివిఆర్ లాంటి పెద్ద సంస్థనే కాంబో ఆఫర్ తోనే టికెట్ లు బల్క్ గా విక్రయించేసింది. అయిదు వందలు టికెట్ వంతున విక్రయించేసారు. దీనికి కొద్దిగా పాప్ కార్న్, 350 ఎమ్ఎల్ పెప్సీ జోడించి 500 వంతున అమ్మేసారు. అంటే ఈ రెండింటి వెల 350 రూపాయిలు అనుకోవాలి. 

ఇలా అధికారికంగానే అమ్మేసిన తరువాత మరి మంత్రి మాటలకు ఏ మాత్రం విలువ వున్నట్లు? ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? పైగా పివిఆర్ నుంచే కాదు, మిగిలిన థియేటర్ల నుంచి కూడా అధిక మొత్తం టికెట్ లు డిస్ట్రిబ్యూటర్ అసియన్ కే వెళ్లిపోయినట్లు వార్తలు వినవస్తున్నాయి. మరి అన్ని టికెట్ లు వారేం చేసినట్లో? ఎవరికి ఇచ్చినట్లో? ఏ రేటుకు ఇచ్చినట్లో వారికే తెలియాలి.   

పైగా పివిఆర్ 500 కు ఈ టికెట్ లు అమ్మితే, అవి సంపాదించి మళ్లీ ఎక్కువ ధరకు రీ సేల్ చేస్తున్నారు. మొత్తం మీద బాహుబలి పుణ్యామా అని అందరూ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు.

Readmore!
Show comments