హీరోహీరోయిన్లు.. ముద్దులు పెట్టీ పెట్టీ అలిసిపోయారు!

వామ్మో.. మరీ అన్ని ముద్దుల, అలసిపోయాం బాబూ.. అని అంటున్నాడు రణ్ వీర్ సింగ్. ఆఖరికి ముద్దులంటేనే విసుగు వచ్చేసింది…  ఈ సినిమా కోసం అంతలా కష్టపడ్డాం. సెట్ లోకి అడుగు పెట్టింది హద్దు.. ముద్దులే ముద్దులు! పై పెదవి మీద మొదట, ఆ వెంటనే కింది పెదవి అందుకోవాలి.. ఆ పై సుధీర్ఘ మైన చుంభనం… ఒక యాంగిల్ లో కాదు, డిఫరెంట్ యాంగిల్స్ లో… దీంతో శరీరం అలిసిపోయింది..  “బేఫికర్’’ సినిమాలో హీరోయిన్  వాణీకపూర్ తో సాగించిన ముద్దులాట గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు.

మరి సినిమాలో తాము నటించిన విధానాల గురించి చెబుతూ… కండలు పెంచడానికి కష్టపడ్డామనో, మరో రకమైన కష్టంతో ఇబ్బంది పడ్డామనో చెప్పే వాళ్లను చాలా మందినే చూశాం. కానీ.. ముద్దు సీన్లలో నటించి, నటించి అలసిపోయామని చెబుతున్నది ఈ హీరో మాత్రమే!

యశ్ రాజ్ పిక్చర్స్ ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రూపొందుతున్న “బేఫికర్’’ సినిమాకు సంబంధించి ఇప్పటికే ముద్దుల పోజులు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన పోస్టర్లన్నింటిలోనూ రణ్ వీర్, వాణీలు పెదవులకు పని చెప్పారు. ఈ సినిమాలో రికార్డు స్థాయిలో ముద్దులు ఉంటాయనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో… ఈ సినిమాలో ముద్దులతో పెదవులు అలసిపోయానని.. కొన్నాళ్లు పాటు ముద్దులకు దూరంగా ఉండటమే ఈ అలసట తగ్గడానికి పరిష్కారమని రణ్ వీర్ చెబుతుండటం… జలసీనే పుట్టించేయడం లేదా!

Show comments