దిల్ రాజు కష్టం అంతా పోయింది

నాన్ కాంట్రావర్సీగా వుండే దిల్ రాజును దువ్వాడ జగన్నాధమ్ కాస్తా కార్నర్ లోకి తోసింది. పాపం, ఆయన చాలా వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. డైరక్టర్ హరీష్ శంకర్ చేసిన హంగామా పుణ్యమా అని చెలరేగిన హడావుడితో డిజె సినిమాను ఆయన ఎంజాయ్ చేయలేకపోయారు. అలాంటి టైమ్ లో ఫిదా విడుదలైంది. పెద్ద హిట్ అయి కూర్చుంది. ఎంత హిట్ అంటే సినిమా ఖర్చు (16) కోట్లలో సగానికి పైగా నైజాంలోనే వసూలు చేసేంత. సినిమా శాటిలైట్ మూడున్నరకు ఎప్పుడో ఇచ్చేసారు. వైజాగ్, నైజాం మినహా మిగిలినవి ఇచ్చేసి, ప్రాఫిట్ లోకి వెళ్లిపోయారు.

అలాంటది ఫిదా సినిమా విడుదలై వీకెండ్ దాటిపోయినా, ఇంకా నైజాంలో రోజూ కోటి రూపాయిలు వసూలు చేసి ఇస్తోంది. ఫిదా అమ్మకాలతో వచ్చిన లాభాలు ఇప్పుడు పీనట్స్ అనుకోవాలి, వైజాగ్, నైజాంల్లో వస్తున్న షేర్ చూస్తుంటే. పైగా డబ్బుల కన్నా దిల్ రాజకు ఆనందం కలిగించింది ఏమిటంటే, డిజె వ్యవహారం పూర్తిగా మరుగున పడిపోయి, అందరూ ఫిదా... ఫిదా అని కలవరించడం. పైగా మరో రెండు రోజుల్లో ఫిదా యూనిట్ మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవబోతోందట. కేసీఆర్ సినిమా చూసి, ప్రశంసించిన సంగతి తెలిసిందే. అందుకే ఓసారి ఆయనను యూనిట్ కలవాలని అనుకుంటోందట. 

మరోపక్క తెలంగాణకు చెందిన ఛానెళ్లు తెలంగాణ అందాలను చూపించిన ఫిదాకు తమవంతు సహకారం అందిస్తాం, తమ ఛానెల్ కు రమ్మనమని యూనిట్ కు పిలుపులు ఇస్తోందట. మొత్తానికి ఆ విధంగా డిజె కష్టం అంతా దిల్ రాజుకు ఇప్పుడు ఫిదా పుణ్యమా అని మాయమైంది.

Show comments