తాప్సీ.. ఎక్స్ పోజింగ్ కు తగిన సినిమా దొరికిందట!

దక్షిణాది సినీ రూపకర్తలపై ఇటీవలే కొంచెం ఘాటైన స్టేట్ మెంట్ ఇచ్చింది తాప్సీ పన్ను. మోడలింగ్ నుంచి దక్షిణాది సినిమాల ద్వారానే పెద్ద తెరకు పరిచయం అయిన ఈ భామ ఇన్నేళ్లూ తనతో అర్థం లేని ఎక్స్ పోజింగ్ చేయించారని ఈ మధ్యనే వాపోయింది. తన అందాలను తెరపై చూపించడంపై పెట్టిన శ్రద్ధ ఇక్కడి దర్శకులు తనలో నటిని చూపించలేకపోయారని తాప్సీ బాలీవుడ్ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హీరోయిన్లను అత్యంత అందంగా చూపిస్తారనే పేరున్న రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సినిమాతో పరిచమైన ఈమె ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం ఆసక్తికరమైన అంశమే!

ప్రస్తుతానికి తనకు అవకాశాలు లేకుండా పోయిన సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీని ఈ ఘాటైన వ్యాఖ్యలతో అవమానించిన ఈ భామ ఇప్పుడు హిందీలో ఒక బోల్డ్ సినిమాకు సై అనడం విశేషం. బోల్డ్ సినిమాలతో హిందీ తెరకు హీటెక్కిస్తున్న ఏక్తా కపూర్ సారధ్యంలో రూపొందే సినిమాలో తాప్సీ నటిస్తోంది. ఏక్తా సినిమాల్లో హీరోయిన్లు ఎంత హాట్ గా కనిపిస్తారో, బోల్డ్ గా ప్రవర్తిస్తారో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాప్సీ కూడా అలాగే కనిపించబోతోంది.

మరి దక్షిణాది సినిమాల్లో తనను చూపించిన తీరుపై నిరసించిన తాప్సీ ఇప్పుడు హాట్ అండ్ బోల్డ్ యాక్ట్ కు సిద్ధం కావడానికో గట్టి లాజిక్ నే వినిపిస్తోంది. ఏక్తా సినిమాల్లో ఎంత బోల్డ్ గా కనిపించినా, ఎంతగా ఎక్స్ పోజింగ్ చేయాల్సి వచ్చినా, ఎన్ని లిప్ కిస్సులు పెట్టినా.. అవన్నీ కథానుసారమే జరుగుతాయని, నటనకు అవకాశం ఉంటుందని తాప్సీ చెప్పుకొస్తోంది! తన ఎంపికను అందంగా సమర్థించుకుంటోంది. మరి దక్షిణాదిన ఆరేడేళ్లు చేసిన హిట్లేమీ లేక నిరాశ పడిన తాప్సీ అదృష్టం ఏక్తా చెయ్యి పడటంతోనైనా మారుతుందేమో చూడాలి!

Show comments