మళ్లీ మరో రెడీ...రెడీ

ధనుష్-జెనీలియా-శ్రియ నటించిన తమిళ సినిమా ఉత్తమ పుత్రియన్. జెనీలియా పేరు చూడగానే అర్థమైపోయి వుంటుంది. నిజమే 2010 లో సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులోకి నారదుడుగా అనువాదమై, ఈ నెలలో విడుదలకు రెడీ అవుతోంది. 

పోనీ తమిళ జనాలకు పాతదైనా, మన జనాలకు కొత్తే అని అనుకోవడానికీ లేదు. ఎందుకంటే మన జనాలకు ఇది అంతకన్నా పాతదే. ఎందుకంటే తెలుగులో రామ్-జెనీలియా నటించిన రెడీ సినిమాకు రీమేక్ నే తమిళ ఉత్తమ పుత్రియన్. దాన్నే మనవాళ్లు మళ్లీ కొని, డబ్బింగ్ చేసి, నారదుడు అని పేరు పెట్టి మరీ ఈ నెల మూడున విడుదలకు రెడీ చేస్తున్నారు. 

బహుశా రెడీ ఎవర్ గ్రీన్ కామెడీ అండ్ ఎంటర్ టైన్ మెంట్ సబ్జెక్ట్. ఏక్టర్లు మారారు కాబట్టి మళ్లీ మరోసారి మన జనం చూస్తారని ధీమాయేమో? అందుకే సరైన ఫన్ సినిమా మార్కెట్ లో లేని టైమ్ లో విడుదలకు రెడీ చేసారు.

Show comments