హాట్‌ అండ్‌ స్పైసీ: ఫస్ట్‌ లేడీ

మెలానియా ట్రంప్‌.. అమెరికాకి కాబోయే ఫస్ట్‌ లేడీ. అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా భార్య మిషెల్లీ ఒబామా ఇప్పుడెలాగైతే అమెరికా ఫస్ట్‌ లేడీగా కొనసాగుతున్నారో, అలాగే జనవరి తర్వాత అమెరికా ఫస్ట్‌ లేడీ హోదాలో మెలానియా ట్రంప్‌ మెరవనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. డోనాల్డ్‌ ట్రంప్‌, అనూహ్య విజయాన్ని అందుకున్నారు. గెలుపు ఖాయమనుకున్న హిల్లరీ క్లింటన్‌ నోట మాట లేదిప్పుడు. 

ఇక, మెలానియా ట్రంప్‌ విషయానికొస్తే, 1970లో జన్మించిన ఆమె 16 ఏళ్ళకే మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఆమె పలు కవర్‌ పేజ్‌లపై అర్ధనగ్నంగా, నగ్నంగా కూడా దర్శనమిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ప్రత్యర్థి వర్గం మెలానియా అర్థనగ్న ఫొటోల్ని అతి నీఛంగా వాడేసిందనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడు కూడా హిల్లరీ వర్గం అవే ఫొటోలతో సోషల్‌ మీడియాలో యుద్ధం కొనసాగిస్తుండడం విశేషం. 

మెలానియా, డోనాల్డ్‌ ట్రంప్‌కి మూడో భార్య. 2005లో డోనాల్డ్‌ ట్రంప్‌ - మెలానియా వివాహం జరిగింది. డోనాల్డ్‌ ట్రంప్‌ మీద లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు, వాటిని సమర్థవంతంగా ఖండించడంలో మెలానియా పాత్ర చాలా ఎక్కువ. అంతేనా, ట్రంప్‌ విజయం కోసం మెలానియా చాలానే కష్టపడ్డారు. ట్రంప్‌ వ్యూహ బృందంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే మోస్ట్‌ గ్లామరస్‌ అండ్‌ హాట్‌ లేడీగా పేరు తెచ్చుకున్న మెలానియా ట్రంప్‌, ఇప్పుడు హాటెస్ట్‌ ఫస్ట్‌ లేడీగా అవతారమెత్తనుండడం విశేషమే మరి.

Show comments