నెలాఖర్లో పూరి సినిమా

పూరీనా? సినిమానా? అని పెద్దగా ఆశ్చర్యం అవసరం లేదు. ప్రస్తుతానికి పూరి చేతిలో సినిమా  ఏదీ లేదు..కొత్తగా ఎవరు డేట్ లు ఇస్తున్న దాఖలాలు లేవు. మరి సినిమా ఏంటీ అని ఫిక్సయిపోవద్దు. ఇంతకు ముందే పూరి దాదాపు పూర్తి చేసి వుంచిన సినిమా ఒకటి వుంది అదే రోగ్. కన్నడ, తెలుగు భాషల్లో తయారైన సినిమా ఇది. 

తెలుగు, కన్నడ చిత్రాల నిర్మాత సిఆర్ మనోహర్ కుమారుడు ఇషాన్ హీరోగా రూపొందించిన సినిమా. ఇరవై కోట్లలో ఫినిష్ చేయాల్సి వుండి, చివర్లో కాస్త మిగిలిపోయి, ఆగిందని ఆ మధ్య గ్యాసిప్ లు వినిపించాయి. మొత్తానికి ఈ సినిమా పూర్తయింది. పూరి ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. 

వీలయితే నెలాఖరున విడుదల చేయాలని ప్లాన్ చేస్తన్నారు. అదీ విషయం. ఈ సినిమా విడుదలయ్యాకనే, పూరి మరో సినిమా మీదకు వెళ్తారట. మరి ఈసారి ఎవరు చాన్స్ ఇస్తున్నారో? రామ్ అని వినిపిస్తోంది. నిజమేనేమో? ఎందుకంటే రామ్ ఇంతవరకు పూరి డైరక్షన్ లో నటించలేదు.

Readmore!
Show comments