తమిళ దర్శకుడితో వెంకీ

మొత్తానికి విక్టరీ వెంకటేష్ కు మరో దర్శకుడు దొరికినట్లే. కిషోర్ తిరుమల, పూరిజగన్నాధ్, క్రిష్ ల తరువాత ఓ తమిళ దర్శకుడు లైన్ లోకి వచ్చినట్లు తెలిసింది. ఓ తమిళ దర్శకుడు చెప్పిన లైన్ వెంకీకి నచ్చడంతో స్టోరీ డిస్కషన్ కోసం ఇక్కడే వుంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేష్ బాబు అందుబాటులో లేనందున ప్రాజెక్టు ఇంకా ఫైనల్ కాలేదు. సురేష్ బాబు వచ్చి కథ విన్నాక ఓకె అయ్యే అవకాశాలు వున్నాయి. 

ప్రస్తుతం అయితే వెంకీ చేతిలో ప్రాజెక్టు ఏమీ లేదు. తెలుగు దర్శకులు అందరూ బిజీ కావడంతో తమిళ చిన్నా పెద్ద దర్శకుల దృష్టి తెలుగు రంగంపై పడింది. హీరో బాలకృష్ణ 102వ సినిమాకు కెఎస్ రవికుమార్ సెట్ అయిపోయారు. అన్నపూర్ణ బ్యానర్ లో రాజ్ తరుణ్ తో ఓ తమిళ దర్శకురాలు సినిమా చేస్తున్నారు. అలాగే తమిళ దర్శకుడు కె వాసు కూడా తెలుగు సినిమా కోసం ట్రయ్ చేస్తున్నారు. లింగుస్వామి కూడా అల్లుఅర్జున్ తో సినిమా ఓకె చేయించుకున్నారు. మురుగదాస్ ఇప్పుడు మహేష్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Show comments