కుర్రాడు ఈ రూట్లోకొచ్చాడా?

వినవయ్యా రామాయ్యా అంటూ ఇండస్ట్రీలోకి వచ్చాడు నాగ అన్వేష్. ఇతగాడు నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి కొడుకు. ఫస్ట్ సినిమా పెద్దగా క్లిక్ కాలేదు కానీ, కుర్రాడు ఫరవాలేదు. ఇంకా కాస్త వయసు రావాలి అన్న కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు కాస్త టైమ్ తీసుకుని ఏంజెల్ అంటూ మరో సినిమాతో వస్తున్నాడు. జగదేకవీరుడు అతిలోక సుందరి కాన్సెప్ట్ లా ఆకాశం నుంచి దిగిన అప్సరస, భూలోకంలో పక్కా బేవార్సు టైపు కురాడు కాంబినేషన్ లో రాసుకున్న కథలా వుంది ఈ రోజు విడుదలైన టీజర్ చూస్తుంటే.

కుర్రాడు కాస్త కోర మీసం పెంచి, మాస్ లుక్, మాస్ క్యారెక్టర్ ట్రయ్ చేస్తున్నట్లుంది. మిస్టర్ మినహా అన్ని సార్లు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న హెబ్బా పటేల్ ఈ సినిమాలో ఏంజెల్ గా చేస్తోంది. ‘నాకు ఇదే కావాలి’ అనడంలోనే మళ్లీ మాంచి ఫన్ తో కూడిన క్యారెక్టర్ అమ్మడికి దొరికినట్లు కనిపిస్తోంది. టీజర్ మరీ కస్సుమంటూ ఖైజార్ లా దిగే రేంజ్ లో లేదు కానీ, సినిమాలో కాస్త మాస్ మహా జనాలకు నచ్చే విషయం వుందని మాత్రం క్లియర్ చేసింది. సో కుర్రాడు రొండో సినిమాకే రూట్లోకి వచ్చేసాడన్నమాట.

Show comments