ఖైదీకి 35 కోట్లు కావాలట

ఖైదీ నెంబర్ 150 సినిమా సేల్స్ స్టార్ట్ అయింది. ఆంధ్ర టార్గెట్ 35 కోట్లుగా ఫిక్స్ చేసుకున్నారట నిర్మాత చరణ్. ఈ లెక్కప్రకారం ఆంధ్రలోని వివిధ ఏరియాల రేట్లు ఫిక్స్ చేసుకుని కూర్చున్నారట. అంటే బాహుబలికి కాస్త తక్కువగా అన్నమాట. ఒక్క విశాఖ ఏరియాకే ఏడు కోట్ల వరకు చెబుతున్నారట. 

చెప్పడం కాదు విశాఖ రైట్స్ ఏడు కోట్లకు అటు ఇటుగా క్రాంతి రెడ్డికి ఇచ్చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. అదేం కాదు, క్రాంతి రెడ్డి అంటే మెగా క్యాంప్ మనిషే..అక్కడ పెట్టి, బేరాలు ట్రయ్ చేస్తున్నారు అని ఇంకో టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ఖైదీ సినిమా విషయంలో చిరంజీవి ఫ్యామిలీ కనీసం ముఫై కోట్ల వరకు లాభం సంపాదించాలని చూస్తున్నట్లు క్లియర్ గా అర్థమైపోతోంది. 

ఎందుకంటే, చిరు రెమ్యూనిరేషన్ పక్కన పెడితే, ఈ సినిమాకు మహా అయితే ఇరవై కోట్ల కన్నా ఖర్చు కాదు. సినిమాను దాదాపు హైదరాబాద్ లోనే మూడు వంతులకు పైగా ఫినిష్ చేసారు. అరవింద్ స్వామి, కాజల్ తప్పితే మరీ భారీ స్టార్ కాస్ట్ ఏమీ లేదు. వినాయక్, రత్నవేలు, దేవీ లాంటి టెక్నీషియన్లకు మాత్రం ఖర్చు తప్పదు. అందువల్ల ఎలా చూసుకున్నా, అరవై నుంచి డెభై కోట్ల మార్కెట్ చేస్తే, 150 వ సినిమా మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా నిర్మాతగా చరణ్ కు కోట్ల పంట పండిస్తుంది.

Show comments