చిరిగిన జీన్సూ.. అంటూ ఓ తెలుగు సినిమా పాటొకటుంటుంది. చిరిగిన జీన్స్ ఇప్పుడో ట్రెండ్. ఆ మాటకొస్తే, చాలాకాలంగా ఈ చిరిగిన జీన్స్‌తో సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. అదే ఫ్యాషన్. అలా చిరిగిన జీన్స్ తక్కువ ధరకే వస్తాయనుకుంటే పొరపాటే.. వాటి ధర సాధారణ జీన్స్‌తో సమానంగా, ఒక్కోసారి చాలా ఎక్కువగా వుంటుంది.
ఇప్పుడిదంతా ఎందుకంటారా.? '1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్, తన జీన్స్‌ని తానే డిజైన్ చేసుకోవడాన్ని ఇష్టపడ్తుందట. డిజైన్ చేయడమంటే, జీన్స్‌ని చించేయడం, తన ఆలోచనలకు తగ్గట్టుగా జీన్స్‌ని చింపేపి, ఒక్కోసారి షార్ట్స్‌గా మార్చేసుకుని వాటితో పార్టీలకు అటెండ్ అవుతుందట. జీన్స్ మాత్రమే కాదు, టాప్స్ విషయంలోనూ కృతి సనన్ ఇదే పద్ధతిని ఫాలో అవుతానని చెబుతోంది.
హీరోయిన్‌ని కాకపోయి వుంటే, ఖచ్చితంగా డిజైనర్‌ని అయ్యేదాన్నంటున్న కృతి సనన్, మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన తనకు ఫ్యాషన్ ట్రెండ్స్‌పై అవగాహన ఎక్కువనీ, ఫ్యాషన్ అంటే కంఫర్ట్‌గా వుంటూనే, గ్లామరస్‌గా వుండేలా కాస్ట్యూమ్స్ ధరించడమేనని ఫ్యాషన్ పాఠాలు చెప్పేస్తోంది.