ఈ మాత్రానికా.. ఆనంద భాష్పాలు, హ్యాపీడేస్ సాంగ్!

మరి ఇప్పుడు తప్పు అధికారులదా? ప్రభుత్వానిదా? అరకొర సౌకర్యాల ఉన్న చోటకి, కనీసం బిల్డింగ్ నిర్మాణ పనులు కూడా పూర్తి కాని చోటకు.. వాళ్లను తరలించిన వాళ్లది తప్పు అనాలా? ఇలాంటి చోట పనిచేయలేం, కూర్చోవడానికి కూర్చిలు కూడా సరిగా లేని చోట మేమెలా పనిచేస్తాం? అని వెళ్లిపోయిన ఉద్యోగులది తప్పు అనాలా? పదిహేను రోజులు గడిచే సరికి తాత్కాలిక సచివాలయంపై మోజు మోకాళ్లకొచ్చింది. 

‘రికార్డు స్థాయి వేగం’ తో నిర్మించిన తాత్కాలిక సెక్రటేరియట్ లో ప్రస్తుతం పని చేస్తున్నది కేవలం మూడువందల మంది అధికారులు మాత్రమే! పదిహేను రోజుల కిందట చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ అయిన తాత్కాలిక సచివాలయంలో పనిచేయడానికంటూ వచ్చిన వాళ్లలో కూడా చాలా మంది తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అరకొర సౌకర్యాలు ఉండటంతో తిరిగి హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో పని చేయడాని వెళ్లిన వారిని అపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

మరి ఈ మాత్రం దానికేనా.. అన్ని ఆనంద భాష్పాలు రాల్చింది? కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని.. బస్సులెక్కి వచ్చింది! ఇక పచ్చ మీడియా హడావుడికీ లోటు లేదు! హ్యాపీడేస్ సాంగ్ శాడ్ వెర్షన్ ను పెట్టి హడావుడి చేసింది. ఏపీ ఉద్యోగులకు హైదరాబాద్ తో బంధం తెగిపోయిందని.. అంతా కొత్త రాజధానికి వచ్చేస్తున్నారు.. ఇదొక పండగలా జరుగుతోందని పచ్చ మీడియా తన శక్తి కొద్దీ జనాలను బ్లఫ్ చేసింది.

మరి పదిహేను రోజులకే హ్యాపీడేస్ అయిపోయాయి.. ఏసీ బస్సులో జర్నీ చేసి వచ్చినంత ఈజీ కాదు, ఇక్కడ పని చేయడం అని స్పష్టం అయ్యింది. అందుకే ఉద్యోగులు తమ దారి తాము చూసుకున్నారు. అంతా అయిపోయింది.. తాత్కాలిక రాజధాని నుంచే పని మొదలైంది. చంద్రబాబు సాధించేశాడు.. అని ఇప్పటికే పండగ కూడా చేసేసినా ఇప్పటి వరకూ ఇక్కడ నుంచి పని చేస్తున్నది రెండంటే రెండు డిపార్టు మెంట్లే.

మొత్తం 28 విభాగాల్లో రెండు విభాగాలే ఇక్కడ నుంచి పని చేస్తున్నాయి. మరి అరకొర వసతులు ఏర్పాటు చేసి.. ఉద్యోగులను ఎటూ కాకుండా చేసి పాలనను స్తంభింపజేయడం ద్వారా బాబు తప్పుచేశారా? లేక ఈ సౌకర్యాలకే అయినా పని చేయాల్సిందే అని ఉద్యోగులను గద్దించలేక ఆయన చేతగానివాడవుతున్నారా?

Show comments