ఇండియన్ నేషనల్ క్రికెట్ ప్లేయర్ల కు ఇది పెళ్లిళ్ల సీజన్ ఉన్నట్టుంది. ఒకరి తర్వాత ఒకరిగా భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన, వహిస్తున్న క్రికెటర్లు వివాహాలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలం రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజాలు వివాహం చేసుకున్నారు. యువరాజ్ సింగ్ ఎంగేజ్ మెంట్ అయ్యింది.
ఆ బ్యాచ్ లోకి తాజాగా జాయిన్ అయ్యాడు ఇషాంత్ శర్మ. లంబూగా ఫేమస్ అయిన ఈ పేస్ బౌలర్ ప్రస్తుతానికి అయితే జాతీయ జట్టు లో స్థానం కోసం పోరాడుతున్నాడు. ఈ ఖాళీ సమయంలోనే ఎంగేజ్ అయ్యాడు ఇషాంత్. ఢిల్లీకి చెందిన ప్రతిమా సింగ్ తో ఇషాంత్ ఎంగేజ్ మెంట్ అయ్యింది.
విశేషం ఏమిటంటే.. ఇషాంత్ కు ఎంగేజ్ అయ్యింది ఒక స్పోర్ట్ వుమన్ తో. ప్రతిమా సింగ్ వాలీబాల్ ప్లేయర్. భారత మహిళా వాలీబాల్ జట్టు సభ్యురాలు. అంతర్జాతీయ వేదికలపై భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరూ వివాహం చేసుకోవడం విశేషం. ఇంతకు ముందు దినేష్ కార్తీక్ కూడా స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ ను వివాహం చేసుకున్నాడు. క్రీడాకారిణిని వివాహం చేసుకొంటూ.. ఇషాంత్ అదే దారిన నడుస్తున్నాడు.