దుకాణం బంద్.. ఈ పిల్ల పనైపోయినట్టే...!

అవికా గౌర్. ఈ హీరోయిన్ చేస్తున్న సినిమాలేంటి? నెక్ట్స్ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఈ రెండు ప్రశ్నల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే, అవికా గౌర్ సడెన్ గా తెరపై నుంచి మాయమైంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. లాస్ట్ ఇయర్ చేసిన ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, అవికా నటించిన ఆఖరి చిత్రం. ఆ తర్వాత మళ్లీ సెట్స్ పై కనిపించలేదు అవిక. 

కెరటంలా తెలుగుతెరపైకి వచ్చిన ఈ చిన్నారి పెళ్లికూతురు ఇప్పుడు ఎందుకో సినిమాలు చేయడం లేదు. సినిమాలు చేయడం లేదు అనేకంటే, అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయని చెప్పడం కరెక్ట్. వస్తూవస్తూనే ఉయ్యాల జంపాల సినిమాతో హిట్ కొట్టిన ఈ అమ్మాయి.. లక్ష్మీరావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ సినిమాలతో విజయాలు అందుకుంది. తాజాగా ఆమె నటించిన ఎక్కడికి పోతావ్ చిన్నవాడా కూడా హిట్టే. ఇలా వరుసగా సక్సెస్ లు ఉన్నప్పటికీ అవికాకు మాత్రం సడెన్ గా అవకాశాలు తగ్గిపోయాయి.

అవికా ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, మూడు పడవలపై కాళ్లు వేసింది. తెలుగులో హిట్స్ ఉన్నప్పటికీ కన్నడ చిత్రపరిశ్రమలోకి ఎంటరైంది. ఇది చాలదన్నట్టు మరాఠి సినిమాల్లో ప్రయత్నిస్తోంది. వీటికి తోడు చదువు కూడా కొనసాగిస్తోందట. ఇంత బిజీగా ఉంటే మన సినిమాల్లో ఏం నటిస్తుందిలే అని తెలుగు దర్శకనిర్మాతలు లైట్ తీసుకున్నారట. దీనికి తోడు ఆమె నటిస్తున్న ఓ ఫిమేల్ ఓరియంటెడ్ తెలుగు సినిమా ఒకటి మధ్యలో ఆగిపోవడంతో అవికా కెరీర్ డైలమాలో పడింది.

Readmore!
Show comments

Related Stories :