శ్రీను వైట్ల.. మరో ఛాన్స్ కొట్టేశాడా!

ప్రస్తుతం వరుణ్ తేజతో ‘మిస్టర్’ సినిమాతో బిజీగా ఉన్న శ్రీను వైట్ల ఆ సినిమా విడుదలకు ముందే మరో సినిమా ఛాన్స్ ను సంపాదించినట్టుగా తెలుస్తోంది. వరస పరాజయాలతో ఒకింత వెనుకబడిన ఈ దర్శకుడు తన తర్వాతి సినిమా విడుదల కాకుండానే, ఆ తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడట. నాగ చైతన్య హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా రూపొందనుందని సమాచారం.

ఇది వరకూ రాణా నిర్మాణంలో  చైతూ హీరోగా సినిమా వస్తుందని ప్రకటించారే.. ఆ సినిమాకే శ్రీను వైట్ల దర్శకత్వం వహించబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నదని తెలుస్తోంది.

సినిమా షూటింగ్ షెడ్యూల్, రెమ్యూనరేషన్లు సెట్ చేసుకోవడమే తరువాయి.. అలాగే దర్శకుడు ‘మిస్టర్’ పనుల నుంచి బయటపడగానే.. సినిమా ప్రారంభం అవుతుందని… సమాచారం. ఇది వరకూ నాగార్జునతో ‘కింగ్’ సినిమాను రూపొందించాడు వైట్ల. ఇప్పుడు చైతూతో ఎలాంటి సినిమాను తీస్తాడో! 

Readmore!
Show comments

Related Stories :