తూచ్‌.. విమోచనం అన్లేదు.!

తెలంగాణ విమోచన దినోత్సవం నేడు. కాదిది విద్రోహదినం.. అనేవారున్నారు. విమోచనం కాదు, విద్రోహం కాదు.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా విలీన దినోత్సవం అంటే సరిపోద్ది కదా.. అనేవారూ లేకపోలేదు. ఎలాగైతేనేం, తెలంగాణ విమోచన దినమో, విద్రోహదినమో, విలీన దినమో.. పేరేదైనా, ఈ విషయంలో మాత్రం తెలంగాణ అనాధలా మారిపోయింది. ఇది కేవలం రాజకీయ పార్టీల సంబరాలకే పరిమితమైపోయింది. 

1948 ఆగస్ట్‌ 17న ప్రస్తు తెలంగాణలోని 18 జిల్లాలతోపాటు, మహారాష్ట్రలోనూ, కర్నాటకలోనూ కలిసిన ఒకప్పటి హైద్రాబాద్‌కి చెందిన జిల్లాలకు స్వాతంత్య్రం వచ్చింది. ఆ రోజే, ఇక్కడ రాచరికానికి ముగింపు పలికి, ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచే ఒకప్పటి హైదరాబాద్‌ ప్రాంతం బారతదేశంలో విలీనమైనట్లు లెక్క. 

మహారాష్ట్రలో విలీన విమోచన దినోత్సవాలకు ఇబ్బంది లేదు.. అధికారికంగా అక్కడ ఆ ఉత్సావాల్ని నిర్వహిస్తారు. కర్నాటకలోనూ సేమ్‌ టు సేమ్‌. తెలంగాణలోనే సమస్య వచ్చిపడింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చేయలేదు గనుక, తెలంగాణ రాష్ట్రంలో మేం అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ నానా యాగీ చేసింది. ఇప్పుడు మర్చిపోయింది. పైగా, 'మేం విమోచనం ఊసెత్తలేదు..' అంటోంది టీఆర్‌ఎస్‌. 

రాచరికంలోంచి ప్రజలు ప్రజాస్వామ్యంలోకి వచ్చిన రోజు ఇది.. అని చెబుతూనే టీఆర్‌ఎస్‌ నేత, హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి, విమచనం ఊసెత్తడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. పైగా విమోచనం అన్న మాటే ఎప్పుడూ తమ నోట రాలేదని సెలవిచ్చారు. పార్టీ కార్యాలయంపై జెండా ఎగరవేసి ఊరుకున్నారు నాయని నర్సింహారెడ్డి. 'మేం అధికారంలోకి వస్తే అధికారికంగా వేడుకలు నిర్వహిస్తాం..' అని చెప్పిన కేసీఆర్‌, ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా ఈ విషయంలో మొహం చాటేశారు. మరెందుకు, అప్పట్లో భావోద్వేగాలు రెచ్చగొట్టినట్లు.? తెలంగాణ భగ్గుమనేలా ఆందోళనలు చేపట్టినట్లు.? ప్చ్‌.. ఆ ఒక్కటీ అడగొద్దంతే.! 

ఇదిలా వుంటే, బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేపట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు హైద్రాబాద్‌ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ విలీన దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తోంది. టీడీపీ మాట కూడా విలీనమే. వామపక్షాల్లో విమోచనం, విద్రోహం అన్న విషయమై భిన్నాభిప్రాయాలున్నా.. వాళ్ళూ తమకు తోచిన రీతిలో అమరవీరుల్ని స్మరించుకుంటున్నారు. ఓ వర్గం మాత్రం, విద్రోహం అనే పనరుతో సైలెంట్‌గా వుంది. ఆ వర్గానికి భయపడే.. విలీనం, విద్రోహం, విమోచన.. అనడానికి టీఆర్‌ఎస్‌ వెనుకంజ వేస్తోంది. 

Show comments