ఏప్రియల్ 7 గురు ఫిక్స్

వెంకటేష్ లేటెస్ట్ మూవీ గురు విడుదలకు ముహుర్తం సెట్ అయింది. ఏప్రియల్ ఏడున ఆ సినిమా విడుదల కాబోతోంది. వాస్తవానికి గురు సినిమా ఎప్పుడో రెడీ అయిపోయింది. సంక్రాంతి వెళ్లిన వెంటనే విడుదల అవుతుందని అనుకున్నారు. నిర్మాతలు కూడా అలాగే చేయాలని అనుకున్నారు. కానీ సరైన స్లాట్ దొరకక అలా నిరీక్షిస్తూ వచ్చారు. ఆఖరికి ఇప్పుడు డేట్ ఫైనల్ చేసుకున్నారు. మార్చి ఎండింగ్ లో కాటమరాయుడు విడుదల అవుతుంది. ఏప్రియల్ ఎండింగ్ లో బాహుబలి 2 విడుదల అవుతుంది. ఈ రెండింటికి మధ్యగా గురు డేట్ ఫిక్స్ చేసారు. 

తమిళ మాతృక ఆధారంగా తయారైన ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసారు. వీలయినంత వరకు సీన్లు మాతృక నుంచి వాడుకుంటూ, వెంకీ సీన్లు మాత్రం రీ షూట్ చేసుకుంటూ వచ్చారని వినికిడి. ఇటీవలే ఈ సినిమా కోసం వెంకీ పాడిన పాటను విడుదల చేసారు. దానికి మంచి అప్లాజ్ నే వచ్చింది. ఓ మిడిల్డ్ ఏజ్డ్ స్పోర్ట్స్ గురు టైపు పాత్రను వెంకీ ఈ సినిమాలో పోషిస్తున్నారు.

Show comments