బాబు మాటల తూటాలు.. పచ్చ మీడియాకే వినిపించాయ్!

ఇక వినండి… ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎంపీల వద్ద తీవ్రంగా స్పందించారట! సభను స్తంభింపజేయలేకపోయారా? అంటూ ఎంపీలకు క్లాస్ పీకాడట. బీజేపీ వాళ్లు నాటకాలు ఆడుతున్నారంటూ.. విరుచుకుపడ్డాడట! తనకు రక్తం మరిగిపోతోందని కూడా బాబు తన పార్టీ నేతలతో వ్యాఖ్యానించాడట.. కావాలంటే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి కూడా సిద్ధం అని కూడా బాబు స్పష్టంగా చెప్పాడట!

ఏ వార్తలు రాస్తే క్షేమమో.. ఏ వార్తలు రాస్తే.. తమ పాఠకుల్లో బాబు ఇమేజ్ ను కాపాడటానికి అవకాశం ఉంటుందో అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ ను రాయడం పచ్చ మీడియాకు ఏమీ కొత్త కాదు! అయితే ఇక్కడ వచ్చే సందేహాలు కొన్ని ఉన్నాయి!

 అయినా తెలుగుదేశం అధినేత ఇవే మాటలు పచ్చ మీడియా కు మాత్రమే వినిపించేలా అనకపోతే దాదాపు గంటకుపైగా సాగిన తన సుధీర్ఘ ప్రెస్ మీట్ లో పలికి ఉండవచ్చు కదా! ఏపీకి ప్రత్యేక హోదా హామీని మీరూ, మేమూ కలిసి ఇచ్చాం.. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి.. అని బీజేపీకి హితబోధ చేస్తూ, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన మీతో కటిఫ్, ఫలానా సమయం లోపు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము ఎన్డీయే నుంచి వైదొలుగుతాం.. అని హెచ్చరిక జారీ చేసి ఉంటే? అప్పుడు కదా.. జనాలకు బాబుగారి మరుగుడు ఏ స్థాయిలో ఉందో అర్థం అయ్యేది!

అలా కాకుండా.. బాబు ఎగిరాడు, బాబు దుంకాడు.. మోడీపై మండి పడ్డాడు, అయితే ఇది మూడోకంటికి తెలీదు, మాకు మాత్రమే తెలిసింది అని అనుకూల మీడియా చేత రాయించుకొంటే.. అంతా అయిపోతుందనేది చంద్రబాబు లెక్కలాగుంది. ఇప్పుడు ఇంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి ఆయనది! Readmore!

కేంద్రంతో ఢీ అనేంత సీన్ లేదు. అలా అంటే ఓటుకు నోటు వ్యవహారం దగ్గర నుంచి వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చిన నిధులను  చెట్ల నాటకం అంటూ పచ్చ పార్టీ నేతల జేబులు నింపడం వరకూ అన్నింటి మీదా విచారణలు మొదలుకావొచ్చు. మ్యానిపులేషన్ కు మీడియా అండ ఉంది.. కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కూడా అనుకూల కథనాలు రాయించుకోవచ్చు! సో ఆ విధంగా ముందుకు పోతున్నాడు తెలుగుదేశాధినేత.

అయినా.. బాబుకు మరిగింది అని చెప్పడంలో కూడా మీనింగుండాలి. ప్రత్యేక హోదా సంజీవని కాదు అని ఇప్పటికే ఆయన మీడియా ముఖంగా చాలా సార్లు తేల్చేశాడు. కానీ ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా రాలేదని తన వాళ్ల మధ్యన మండి పడ్డాడట! దానికి అంత విలువ లేదని తనే సూత్రీకరించి.. ఇప్పుడు దాని గురించి ఈ హైబీపీ ఎందుకు తెచ్చుకున్నాడు? 
బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి భయమేసి.. తన పార్టీ వాళ్ల మధ్య ఎందుకు మండిపడ్డారా? పచ్చమీడియా నెరేషన్ రొటీన్ కామెడీగానే ఉంది!

Show comments

Related Stories :