రాజ్ తరుణ్ తో కొండా విజయ్

గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీలో పేరు సర్రున వచ్చేసింది డైరక్టర్ కొండా విజయ్ కుమార్ కు. రెండో సినిమా నాగ్ చైతన్యతో చేసినా పెద్దగా యూజ్ లేకపోయింది. కానీ మరీ బ్యాడ్ నేమ్ అయతే రాలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

కిట్టూ వున్నాడు జాగ్రత్త తో హిట్ కొట్టి, అంథగాడు సినిమా ఫినిష్ చేసి, అన్నపూర్ణ బ్యానర్ పై మరో సినిమా ఫినిష్ చేసే పనిలో వున్నాడు హీరో రాజ్ తరుణ్. ఇప్పుడు ఆ కొండా, ఈ రాజ్ తరుణ్ జత కడుతున్నారు. ఇద్దరు కలిసి మాంచి స్క్రిప్ట్ కు ఓకె అనుకున్నారు.

అన్నపూర్ణతో చేస్తున్న సినిమా ఫినిష్ కాగానే ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. నిర్మాణ సంస్థ ఎవరన్నది ఫైనల్ కాలేదు. బహుశా పివిపి లాంటి పెద్ద సంస్థ కావచ్చు.

Show comments