మణిరత్నం.. పోస్టర్ తో ఊరిస్తున్నాడు!

ప్రతి జనరేషన్ కూ తగిన ప్రేమ కథలను అందించిన దర్శకుడు మరి. మౌనరాగం, సఖి, ఓకే బంగారం..  ఒక్కో దశాబ్దానికి తగ్గట్టైన ఒక్కో ప్రేమకథను కానుకలుగా ఇచ్చారాయన. ఇప్పుడు మరో ప్రేమ కథతో వచ్చారు. పోస్టర్ తోనే ‘వావ్’ అనిపించాడు. ఆ పోస్టర్ ను ఎక్స్ ప్లెయిన్ చేయడానికి మాటలు చాలవ్. సినిమా రావాల్సిందే! 

కార్తీ, అదితీరావ్ లు జంటగా తెరకెక్కుతున్న ‘కాట్రువెలియిడై’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. తారాగణం విషయంలో పలు మార్పు చేర్పులు.. వాయిదాల అనంతరం  ఈ సినిమా కొన్నాళ్ల కిందట పట్టాలెక్కింది. ఇప్పుడు పోస్టర్ వరకూ వచ్చింది. ఏఆర్ రెహమాట్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం మణిరత్నం అభిమానులకు ఉత్సాహాన్ని, సినిమాపై ఊరింపును పెంచుతోందనడంలో సందేహం లేదు. 

Show comments