జయలలిత సమాధి వద్ద హీరోయిన్ నివాళి

ఇప్పటికే జయలలితపై తన అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంది నటీమణి త్రిష. ఈ హీరోయిన్ ట్విటర్ అకౌంట్ కవర్ ఫోటోలో చాలా కాలంగా జయలలితతో తను అవార్డును అందుకుంటున్న ఫొటోనే ఉంచుకుంది. అలాగే.. జయలలిత చదివిన కాలేజ్ లోనో, స్కూల్ లోనో తను చదివాను అని చాలా గర్వంగా చెప్పుకొంటూ ఉంటుంది. ఈ మధ్యనే జయ బయోపిక్ తీస్తే అందులో తను నటిస్తానని ఉత్సాహంగా చెప్పింది. 

ఈ విధంగా జయలలిత ఫ్యాన్ గా గుర్తింపు పొందిన త్రిష.. ఆదివారం మెరీనా బీచ్ లోని జయ సమాధిని సందర్శించింది. దివంగత ముఖ్యమంత్రికి నివాళి ఘటించింది. త్రిషతో పాటు ఆమె తల్లి కూడా ఉన్నారు. అంత్యక్రియల రోజున షూటింగ్ ఉండటంతో హాజరు కాలేకపోయానని.. త్రిష తెలిపింది.

సమాధి వద్దే కాసేపు కూర్చుని జయను స్మరించుకుంది త్రిష. ఇక వారాంతంలో జయలలిత సమాధికి అభిమానుల తాకిడి పెరిగింది. జయకు నివాళిగా తల నీలాలు అర్పిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆది వారం అయితే దాదాపు వెయ్యి మంది అక్కడ తలనీలాలు అర్పించారట. మొత్తానికి.. జయలలిత సమాధి తమిళులకు ఒక పవిత్ర క్షేత్రంగా మారిపోయేలా ఉంది. 

Readmore!
Show comments

Related Stories :