న్యూ ఇయర్ కు ఇంట్లో దెయ్యం

అల్లరి నరేష్ - నాగశ్వర రెడ్డి కాంబినేషన్ లో బివివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన సినిమా ఇంట్లో దెయ్యం నాకేం బయ్యం. చకచకా రెడీ అయిపోయి, మాంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా, నోట్ల రద్దు గడబిడలో వాయిదా పడిపోక తప్పలేదు. ఆ వెంటనే మళ్లీ డేట్ సెట్ చేద్దాం అనుకుంటే లైన్లో బోలెడు సినిమాలు. అందుకే వెయిట్ అండ్ సీ అని వుండిపోయింది అల్లరి నరేష్ దెయ్యం. 

ఇప్పుడు ఓ డేట్ ను ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30 లేదా 31న విడుదల చేద్దామని నిర్మాత బోగవిల్లి ప్రసాద్ ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ డేట్ మీద ఎవరు కన్నేయలేదు. పైగా వున్న సినిమాలన్నీ డిసెంబర్ 23తో ఫినిష్ అయిపోతున్నాయి. పండుగ సినిమాలకు, న్యూ ఇయర్ కు మధ్య రెండు వారాల గ్యాప్ వుంటుంది. సో, ఈ డేట్ కు వేద్దామని ఆలోచనలో వున్నారు.  

అదే సమయంలో పండగకు అన్నీ భారీ, ఎమోషనల్ సినిమాలే వున్నాయి కదా, ఈ ఫన్ సినిమాను అప్పుడే వాటి మధ్య విడుదల చేస్తే ఏలా వుంటుంది అన్న ఆలోచన కూడా ఇంకా వుంది. ఇవ్వాళో రేపో ఫైనల్ అవుతుంది.

Readmore!
Show comments