లింగుస్వామితో తకరారు?

సాధారణంగా మన దర్శకులు, మన హీరోల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ప్రాజెక్టు ఫైనల్ అయినా కూడా హీరో లేదా ప్రొడక్షన్ హవుస్ నోటి వెంట మినహా, వివరాలు తాము వెల్లడించే సాహసం చేయరు. ఒకద్దరు మరీ అత్యుత్సాహం వున్నవారు ధైర్యం చేసి, తమకు తెలిసిన మీడియా మిత్రులకు ఫీలర్లుగా వదుల్తారు.

అయితే ఇప్పుడు ఓ తమిళ దర్శకుడి వ్యవహారం గీతా ఆర్ట్స్ క్యాంప్ కు కాస్త చికాకు కలిగిస్తోందట. ఆ డైరక్టర్ ఎవరో కాదు. లింగుస్వామి. అతగాడితో సినిమా చేద్దామని బన్నీ అనుకున్న మాట వాస్తవం. అయితే ఇంత వరకు కథ ఫైనల్ కాలేదు.. మిగిలిన వ్యవహారాల సమస్యే లేదు. కానీ ఎక్కడపడితే అక్కడ లింగుస్వామితో సినిమా.. ఇదిగో షెడ్యూలు.. అదిగో స్టార్ కాస్ట్.. ఈయనే మ్యూజిక్ డైరక్టర్ అంటూ రకరకాల కథనాలు వినిపిస్తుండడం గీతాఆర్ట్స్ కు కాస్త చికాకు కలిగిస్తోందట. ఆలు లేదు చూలు లేదు అన్నట్లుగా ఇదెక్కడి తలకాయనొప్పి అని అనుకుంటున్నారట.

లింగుస్వామికి చిన్న షాక్ తగలాలి అంటే, వేరే డైరక్టర్ తో సినిమా ఫైనల్ చేయడం ఒకటే మార్గం అని కూడా బన్నీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ మార్కెట్ పెంచుకోవడం కోసం లింగుస్వామి, లేదా విక్రమ్ కుమార్ లతో సినిమా చేద్దామని ఆలోచన చేస్తే, ఇలా లేని వార్తలు పుట్టించడం ఏమిటి అన్నది పాయింట్ గా వుందట.

నిజానికి లింగుస్వామి ఏడాదికి పైగానే తెలుగు హీరోతో సినిమా చేయాలని తెగ తాపత్రయ పడుతున్నారు. మహేష్ కు కథ చెప్పాలని, చాన్స్ సంపాదించాలని కిందా మీదా పడ్డాడు కానీ, అక్కడ పప్పులు ఉడకలేదని వినికిడి. దాంతో బన్నీ వైపు వచ్చారు..ఇక్కడ ఇలా.  Readmore!

Show comments

Related Stories :