సిఎన్ఎన్ (అమెరికా) చానెల్ చేసిన ఓ చిన్న పద ప్రయోగం, ఆ చానెల్ పై ట్విట్టర్ లో దుమారానికి తెరలేపింది. ఇంతకీ సిఎన్ఎన్ చేసినది ఏమిటంటే..సూపర్ స్టార్ రజనీని బాలీవుడ్ స్టార్ గా అభివర్ణించడమే.
సిఎన్ఎన్ చానెల్ చేసిన ఆ ట్వీట్ పై రివర్స్ లో సెటైర్లతో కూడిన ట్వీట్ల వర్షం కురిసింది. సిఎన్ఎన్ ఒక ఆర్టికల్ ప్రచురిస్తూ, దాని గురించిన ట్వీట్ లో రజనీని బాలీవుడ్ స్టార్ గా అభివర్ణించింది. కబాలితో రజనీ కాంత్ స్టామినా ఏవిధంగా మరోసారి రుజువైందో ఆ వైనాలన్నీ ఆ ఆర్టికల్ లో పొందుపరిచారు.
యుఎస్ లో టాప్ టెన్ లో తొమ్మిదవ స్థానాన్ని రజనీ కబాలి ఆక్యుపై చేసిన సంగతిని, ఇక కబాలి కమర్షియల్ విశేషాలను మరోసారి ఏకరవు పెట్టారు. కబాలి టికెట్ వ్యవహారాలు, స్పెషల్ ఫ్లయిట్ లు, ఆఫీసులకు సెలవులు ఇలా అన్నీ ఈ వ్యాసంలో వున్నాయి. కానీ సమస్య వ్యాసం కాదు.
వ్యాసంలోనూ, ట్వీట్ లోనూ రజనీని బాలీవుడ్ హీరోగా పేర్కోనడంతో వచ్చింది. ఇక జనం ఓ లెక్కన విరుచుకుపడ్డారు ట్విట్టర్ లో. అయితే ఈ విషయంలో మాత్రం సిఎన్ఎన్ పునరాలోచించడం కానీ, వెనక్కు తగ్గే ఆలోచనలో కానీ వున్నట్లు కనిపించడం లేదు.
సిఎన్ఎన్ ను ఇంకా నమ్మకమైన న్యూస్ సోర్స్ అనుకుంటే అంతకన్నా అవివేకం ఇంకొకటి వుండదని ఓ ట్వీట్.
సిఎన్ఎన్ కు ఆఫీసులో ఇంటర్ నెట్ కనెక్షన్ వుందా? వుంటే ఇలా ట్వీట్ చేసే ముందు గూగుల్ లో ఓసారి సెర్చ్ చేసి వుండాల్సింది అన్నది ఇంకో ట్వీట్.
ఆర్ఐపి..సిఎన్ఎన్ అన్నది మరీ ఎక్స్ ట్రీమ్ ట్వీట్.
సిఎన్ఎన్ లాంటి కామెడీ చానెల్ గురించి ఇంతవరకు మీరు విని వుండరు..అంటూ మరోటి.
అసలు సిఎన్ఎన్ ఎవరబ్బా...ఇదో చమత్కారం.
ఇక చిన్న చిన్న పిక్చర్లతో, జిఫ్ లతో వెటకారాలు ఇన్నీ అన్నీ కావు.
పాపం అసలే ఓ సౌత్ సూపర్ స్టార్ తన సినిమాతో బాలీవుడ్ రికార్డులను మూలన పోగు పెడితే, ఇప్పుడు సౌత్ జనాలు తాము ఎప్పటికీ రజనీని బాలీవుడ్ స్టార్ గా ఒప్పుకోమని ట్విటర్ యుద్ధం సాక్షిగా మరోసారి డిక్లేర్ చేసారు. రజనీ ఒకప్పుడు హిందీ సినిమాల్లో వేస్తే వేసి వుండొచ్చు. కానీ ఆయన ఎప్పటికీ సౌత్ సూపర్ స్టార్ నే కదా?