ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో బర్త్ డే గిఫ్ట్

తన పుట్టినరోజు కానుకగా ఇప్పటికే జై లవకుశ ఫస్ట్ లుక్ అందించాడు ఎన్టీఆర్. అదే ఊపులో మరో కొత్త సినిమా ప్రకటించి ఫ్యాన్స్ లో ఆనందాన్ని రెట్టింపు చేశాడు. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివతో మళ్లీ సినిమా చేయబోతున్నాడు తారక్.

ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో సినిమా పక్కా అయిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడా ప్రాజెక్టు అఫీషియల్ గా ఓకే అయింది. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్-కొరటాల సినిమాకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ బిగ్ బడ్జెట్ ప్రాజెక్టుతో మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా మారబోతున్నాడు.

కొరటాల, మిక్కిలినేని మంచి ఫ్రెండ్స్. అందుకే కొరటాల సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు మిక్కిలినేని సుధాకర్. మరీ ముఖ్యంగా అది ఎన్టీఆర్ తో సినిమా కావడంతో ఇప్పుడు అందరి దృష్టి మిక్కిలినేనిపై పడింది. ఆయనకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో చాలా అనుభవం ఉంది. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే తెలుస్తాయి.

Show comments