సన్నీలియోన్‌ 'న్యూ' ప్లాన్స్‌

సన్నీలియోన్‌ గత ఏడాదిలో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. సినిమాల సంగతెలా వున్నా, చాలా కమర్షియల్‌ యాడ్స్‌లో కన్పించింది. బ్రాండ్‌ అంబాసిడర్‌గా సన్నీలియోన్‌ 'వాల్యూ' 2016లో బాగా పెరిగింది. అదీ ఇదీ అని ఆలోచించలేదు.. ఎలాంటి ఆఫర్‌ వచ్చినాసరే, దాదాపుగా ఓకే చెప్పేసింది సన్నీలియోన్‌. లక్కీగా అవన్నీ ఆమెకు కనకవర్షం కురిపించేశాయనుకోండి.. అది వేరే విషయం. సన్నీలియోన్‌ తప్ప, ఇంకెవరూ చేయలేని యాడ్స్‌ కావడంతో ఆమె పంట పండిందలా. 

ఇక, 2017 విషయానికొస్తే, 'రయీస్‌' సినిమా తనకు వెరీ వెరీ స్పెషల్‌ అంటోంది సన్నీలియోన్‌. ఈ సినిమా విడుదలయ్యాక తన ఫేమ్‌ ఇంకా మారిపోతుందనీ, తనకున్న ఫాలోయింగ్‌ అత్యున్నతస్థాయికి చేరుతుందనీ సన్నీలియోన్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కొత్త సంవత్సరంలో, సినిమా నిర్మాణంపై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు 'న్యూ' ప్లాన్స్‌ గురించి ఆమె వెల్లడించింది. దాంతోపాటుగా, భర్తతో కలిసి ముంబైలో బిజినెస్‌ ఛెయిన్‌ ఒకటి ప్రారంభించాలనుకుంటోందట. 

ఆల్రెడీ తాను ముంబైలోనే సెటిలైపోయాననీ, తానిప్పుడు ఇండియన్‌నేనని సన్నీలియోన్‌ చెబుతోంది. పోర్న్‌ సినిమాల్లోంచి బాలీవుడ్‌లోకి వచ్చిన ఇండో కెనడియన్‌ సన్నీలియోన్‌. భారతీయ మూలాలున్న సన్నీలియోన్‌, ప్రస్తుతం బాలీవుడ్‌లో హాటెస్ట్‌ బ్యూటీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

Show comments