'పటేల్' సినిమా ఫస్ట్ లుక్ బయటకొచ్చింది. దీన్ని ఫస్ట్ లుక్ అనాలా.? ఇంకేమన్నా అనాలా.? ఎందుకంటే, ఆల్రెడీ ఫస్ట్ లుక్ వచ్చేసింది మరి. సినిమా ప్రారంభానికి ముందే, టీజర్‌ని కట్ చేసి వదిలారు. అదిరిపోయేలా వుంది ఆ టీజర్.
జగపతిబాబు డిఫరెంట్ లుక్ ఆ టీజర్‌కే హైలైట్. తెల్లగా నెరిసిన జుట్టు, కండలు తిరిగిన శరీరం, కోర మీసం.. 'రగ్‌డ్ లుక్ కా బాప్' అనే స్థాయిలో జగపతిబాబు లుక్‌ని 'డిజైన్' చేశారు 'పటేల్' సినిమా కోసం.
వారాహి సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్నారు. ముందు టీజర్ వచ్చింది.. దాన్ని ప్రీ లుక్ అనాలేమో. ఆ తర్వాత సినిమా ప్రారంభోత్సవం జరిగింది. దాంతో అంతా షాక్‌కి గురయ్యారు. టెక్నికల్‌గా మాంఛి సౌండింగ్ వుందనేలా ఆ ప్రీ లుక్ టీజర్‌ని డిజైన్ చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి.
అసలు సినిమా సెట్స్ మీదకు వెళ్ళిందా.? లేదా.? అని గాసిప్స్ విన్పిస్తున్న వేళ, జులైలో సినిమా విడుదల.. అంటూ 'పటేల్ ఎస్‌ఐఆర్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. మాంఛి థ్రిల్లింగ్‌గా అన్పించే ప్రీ లుక్ టీజర్‌తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసిన దర్శక నిర్మాతలు, సినిమాతో ఏ స్థాయి హిట్ సొంతం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.