సింగం...ఇది కరెక్ట్ కాదు మీకు

ఒక విధంగా ఇండియాలోనే ఓ రికార్డు సృష్టించింది సింగం 3. ఎందుకంటే అదే హీరో, అదే హీరోయిన్, అదే డైరక్టర్..ఇలా మూడు సీక్వెల్ సినిమాలు చేసింది సింగంతోనే. కానీ అలాంటి సింగం 3 సినిమా నానా పాట్లు పడుతోంది విడుదలకు. సరే ఆఖరికి ఈ నెల 9న పక్కా అంటున్నారు. తెలుగు వెర్షన్ ను ఏకంగా 15 కోట్లకు పైగా రేటుకు అమ్మేసారు. అక్కడితో బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు సింగం జనాలు. 

ఇక్కడ పబ్లిసిటీ చేద్దామంటే ఎవరూ అందుబాటులోకి రావడం లేదు. పోనీ అలా అని చెన్నయ్ లో వున్నారు, సమస్య కదా అనుకోవడానికి లేదు. సూర్య తన సినిమా షూటింగ్ పనిపై రామోజీ ఫిల్మ్ సిటీలో వున్నారు. శృతి హాసన్ కాటమరాయుడు షూట్ కోసం ఇక్కడే వుంది. సరే, ఇక  అనుష్క కూడా ఇక్కడే వుంది. కానీ ఏ ఒక్కరు కూడా పబ్లిసిటీ కి రావడం లేదు. దీంతో తెలుగు వెర్షన్ కొన్న నిర్మాత ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. పబ్లిసిటీ సంగతి తానుచూసుకుంటాను, అదరగొట్టేద్దాం అన్న జ్ఞాన్ వేల్ రాజా వస్తున్నా దాఖలాలు అసలే లేవట. ఇదీ సింగం 3 పరిస్థితి. 

Show comments