బుల్లితెరపై ఉగాది వార్... గెలుపెవరిది?

ఏదైనా పండగ వస్తోందంటే చాలు... వెండితెర కంటే బుల్లితెరపై ఎక్కువ హంగామా కనిపిస్తోంది. కొత్త కొత్త సినిమాలన్నీ పోటాపోటీగా టీవీల్లో వచ్చేస్తున్నాయి. ఈసారి కూడా అలాంటిదే మరో వార్ షురూ కానుంది. ఉగాది సందర్భంగా ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ అన్నీ కొత్త సినిమాలతో ప్రేక్షకుల్ని తమవైపు తిప్పుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. 

సంక్రాంతి కానుకగా విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా.. ఈ ఉగాదికి టీవీల్లో కనువిందు చేయనుంది. ఇది తెలుగుజాతి కథంటూ తెరకెక్కిన ఈ మూవీ... తెలుగు సంవత్సరాదిన టీవీ ప్రేక్షకుల ముందుకురాబోతోంది. అటు మరో సంక్రాంతి సినిమా శతమానంభవతి కూడా టీవీలో కనిపించేందుకు సిద్ధమైంది. సిసలైన సంక్రాంతి సినిమా ఇదేనంటూ ప్రచారం పొందిన ఈ మూవీ, ఉగాదిని కూడా తమ సినిమాతో సెలబ్రేట్ చేసుకోమని ఊరిస్తోంది. 

ఈ రెండు సినిమాలతో పాటు నాని నటించిన జెంటిల్ మేన్ మూవీ కూడా ఉగాది కానుకగా టీవీ ఆడియన్స్ ముందుకురానుంది. బాలయ్యకు మాస్ ఫాలోయింగ్ ఉంది. శతమానంభవతి సినిమా ఫ్యామిలీ మూవీ. నాని మూవీస్ కు టీవీల్లో మంచి రేటింగ్ ఉంది. అందుకే వీటిలో ఏ సినిమాకు హయ్యస్ట్ టీఆర్పీ రానుందనే అంశం ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

Show comments