ఒక్కోసారి కోన్ని నినాదాలు భలే క్లిక్ అవుతాయి. బాబు రావాలి.. జాబు రావాలి.. అన్న నినాదం మొన్నటికి మొన్న ఎన్నికల ముందు భలేగా పనిచేసింది. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అధికారం అందివ్వడానికి భలేగా పనిచేసింది. ఇప్పుడు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా, జస్ట్ ఎ4 సైజ్ బ్లాక్ అండ్ వెట్ జిరాక్స్ పోస్టర్లు కనిపిస్తున్నాయి.
ఎక్కడపడితే అక్కడ లెక్కకు మించిన సంఖ్యలో వీటిని అంటిస్తున్నారు. 'నేను కాపుని..గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు సిగ్గుపడుతున్నా..ఇకపై ఓటు వేయడం అన్నా మానేస్తా కానీ, తెలుగుదేశం పార్టీకి వేయను' అన్నది ఈ పోస్టర్ సారాశం. దీని మీద బాటమ్ లో కీలమైన స్లోగన్ చేర్చారు. సెండ్ బాబు బ్యాక్..అన్నది ఆ స్లోగన్. ఇది ఇప్పుడు గోదావరి జిల్లా కాపు యువతలో భలేగా హల్ చల్ చేస్తోంది. మరి ఈ స్లోగన్ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.