పూరి జగన్నాధ్ రోగ్ రెడీ

ఎప్పుడో రావాల్సిన సినిమా డైరక్టర్ పూరి జగన్నాధ్ 'రోగ్'. కొత్త కుర్రాడు ఇషాన్ హీరో. అయితే అనేకానేక సమస్యలతో ఆ సినిమా అలా అలా వుండిపోయింది. కళ్యాణ్ రామ్ ఇజమ్ తరువాత ఫ్రీ టైమ్ దొరకడంతో పూరి ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసేసాడు. ఈ మధ్యనే తన సర్కిల్ సన్నిహితులకు, కొందరు బయ్యర్లకు ఆ సినిమాను చూపించినట్లు తెలుస్తోంది.

చూసిన వాళ్లు సినిమా సంగతి ఎలా వున్నా, కొత్త కుర్రాడు ఇషాన్ గురించి మాత్రం బాగానే రిపోర్టులు ఇస్తున్నారు. పూరి క్యారెక్టర్ కు తగినట్లు చాలా ఎనర్జటిక్ గా చేసాడంటున్నారు. హీరో క్యారెక్టర్ మళ్లీ మరోసారి పూరి 'ఇడియట్' స్టయిల్ లోనే వుందట. ఇప్పుడు ఈ సినిమాను మార్కెట్ చేయడానికి చూస్తున్నారు. కన్నడ సినిమా మార్కెట్ కు ప్రాబ్లమ్ లేదు. 

ఎందుకంటే కుర్రాడు అక్కడి వాడు, ఇషాన్ ఫాదర్ కు అక్కడ సినిమా బిజినెస్ వుంది కాబట్టి. కానీ ఇక్కడ మార్కెట్ నే చూసుకోవాలి. సినిమాకు 20 కోట్ల వరకు ఖర్చుచేసినట్లు వినికిడి. అంటే తెలుగులో కూడా కాస్త చెప్పుకోదగ్గ రేట్లకే అమ్మాలి. మరి పూరి ఆ టాస్క్ ను ఫినిష్ చేయగలరా అన్నది చూడాలి. ఇది విడుదలై మాంచి రిపోర్ట్ వస్తే, పూరి జగన్నాధ్ బండి మళ్లీ ముందుకు కదలడం వీజీ అవుతుంది.

Show comments