శృతిహాసన్‌ ప్రయార్టీస్‌ మారిపోయాయ్‌

నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు.. శృతిహాసన్‌ మాత్రం ఇకపై సినిమాల్లో నటించడంతోపాటుగా, మ్యూజిక్‌ మీదా ఫోకస్‌ పెడుతుందట. మ్యూజిక్‌ ఒక్కటే కాదు, పాటలు పాడటం, సినిమా స్క్రిప్ట్‌లు తయారు చేయడం.. ఇలా చాలానే చేస్తుందట. షడెన్‌గా శృతిహాసన్‌లో ఇంత ఛేంజ్‌ ఏంటి.? అని ఆశ్చర్యపోతున్నారా.! అందుకే, శృతిహాసన్‌ ముందే క్లారిటీ ఇచ్చేసింది నమ్మితే నమ్మండి, లేకపోతే మానెయ్యండని. 

టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్ల రేసులో దూసుకుపోయిన శృతిహాసన్‌, అనూహ్యంగా వేగం తగ్గించేసింది. 'కాటమరాయుడు' సినిమాలో శృతిహాసన్‌ని చూసినవారెవరైనాసరే, 'శృతిహాసన్‌ కెరీర్‌ ఇక్కడితో ముగిసినట్లే..' అనుకోకుండా వుండలేరు. ఆ వెంటనే, 'సంఘమిత్ర' సినిమాతో వార్తలకెక్కింది. ఏం లాభం.? ఆ సినిమా లోంచి శృతిహాసన్‌ని పక్కన పడేశారు. ప్రస్తుతం ఒకటీ అరా బాలీవుడ్‌ సినిమాలతో నెట్టుకొచ్చేస్తోంది శృతిహాసన్‌. 

కెరీర్‌లో ఇంత డల్‌నెస్‌ ఏంటి.? అనడిగితే, 'మ్యూజిక్‌ మీద దృష్టిపెట్టాలనుకుంటున్నాను.. పాటలు పాడటం, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ రూపొందించడమే కాదు, సినిమా స్క్రిప్ట్‌లు కూడా తయారు చేయాలన్న ఆలోచనతో వున్నాను.. నా ప్రయార్టీస్‌ మారాయి గనుక.. కెరీర్‌లో వేగం తగ్గినట్లు మీకు అన్పించవచ్చు..' అంటూ శృతిహాసన్‌ సమాధానమిచ్చింది. నమ్మేద్దామా.?

Show comments