'సెక్స్‌బాంబ్‌'.. అంత వీజీ కాదట

సెక్స్‌బాంబ్‌ అన్న ఇమేజ్‌ అంత తేలిగ్గా రాదంటోంది బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ప్రస్తుతానికైతే ఐటమ్‌ సాంగ్స్‌తోనూ, వ్యాంప్‌ తరహా పాత్రలతోనూ సరిపెడ్తోన్న ఊర్వశి, త్వరలోనే ఓ సెన్సేషన్‌ న్యూస్‌తో అందరికీ షాకివ్వబోతున్నానంటోంది. ఆ షాకింగ్‌ న్యూస్‌ ఏంటి.? అనడిగితే, 'చెప్పేస్తే, షాకింగ్‌ ఎలా అవుతుంది.?' అని ఎదురు ప్రశ్నిస్తోందీ బ్యూటీ. 

తాజాగా 'కాబిల్‌' సినిమా కోసం ఐటమ్‌ బాంబ్‌లా మారిపోయి, ఇంటర్నెట్‌లో సంచలనాలు సృష్టించేస్తోంది ఊర్వశి రౌతేలా. 'కాబిల్‌'లో ఊర్వశి ఐటమ్‌ సాంగ్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయిన విషయం విదితమే. అయినా, ఊర్వశికి ఐటమ్‌ సాంగ్స్‌ కొత్తేమీ కాదు. గ్లామరస్‌గా కన్పించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. 

ఇంతకీ, ఊర్వశి చెప్పబోయే ఆ సెన్సేషన్‌ న్యూస్‌ ఏంటంటే, హృతిక్‌ రోషన్‌ తదుపరి సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ అట. బాలీవుడ్‌లో విన్పిస్తోన్న హాటెస్ట్‌ గాసిప్‌ ఇది. ఊర్వశి మాత్రం, 'నో కామెంట్‌, నేను చెప్పబోయే సెన్సేషనల్‌ న్యూస్‌ ప్రస్తుతానికి సస్పెన్సే..' అంటోంది. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా వుండే అవకాశం దొరుకుతోందనీ, గాసిప్స్‌పై క్లారిటీ ఇవ్వడానికీ సోషల్‌ మీడియా భలే వేదిక అని చెబుతోంది ఊర్వశి. 

హీరోయిన్‌గా మంచి అవకాశం కోసం తాను ఎదురుచూస్తున్నానంటోన్న ఊర్వశి, ఆ సక్సెస్‌ వస్తే, స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ పెద్ద విషయమేమీ కాదని అభిప్రాయపడింది. ఇప్పుడున్న సెక్స్‌బాంబ్‌ ఇమేజ్‌ ఆషామాషీగా వచ్చేయలేదనీ, దీని వెనుక గ్లామరస్‌గా కన్పించడానికి తాను పడ్డ కష్టమేంటో తనకు మాత్రమే తెలుసనీ, ఈ ఇమేజ్‌ని కూడా తాను ఎంజాయ్‌ చేస్తున్నానని ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చింది.

Show comments