అక్కడి జనాలకు శృంగారసక్తి లేదట!

సెక్స్ అనేది కేవలం సంతాన ప్రాప్తి కోసమే… అని తమ భార్యలు భావించేస్తున్నారని కొందరు పురుషులు మ్యూజింగ్సే రాసుకొంటూ ఉంటారు. ఈ శృంగార పురుషుల వేదన ఇలా ఉంటే.. ఆ దేశాల ప్రభుత్వాలు సామాజిక సంస్థలు… కనీసం సంతాన ప్రాప్తి కోసం అయినా శృంగారంలో పాల్గొనండని తమ దేశ జనులకు విన్నవించుకుంటున్నాయి. దేశంలో జనాభా తగ్గిపోతోంది.. కొన్నేళ్లు పోతే మన దేశంలో జనాభా సగానికి సగం తగ్గిపోతుంది.. ఆదే తీరును కొనసాగితే, అసలు ఈ గడ్డపై మనుషులే లేకుండా పోయి మొత్తం అడవైపోతుంది.. అనే ఆవేదన వారిది.

అధ్యయనాలు చేసి మరీ కొన్నేళ్లలో తమ దేశాల్లో జనాభా తరుగుదల రేటును వివరిస్తున్నాయి  కొన్ని దేశాలు. ఈ జాబితాలో బాగా అభివృద్ది చెందిన దేశాలు ఉండటం ఆసక్తికరమైన అంశం. జపాన్, న్యూజిలాండ్, సింగపూర్ , ఆస్ట్రేలియాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి కొత్త తలనొప్పి పట్టుకుంది. జనాభా తగ్గిపోవడమే ఈ దేశాల సామాజిక సమస్య!

ఒకవైపు భారత్ తో సహా ఎన్నో దేశాలు అధిక జనాభాతో అల్లాడిపోతుంటే… జనాభాను నియంత్రించడం ఎలారా భగవంతుడా..అని బాధపడుతుంటే, పై దేశాల్లో మాత్రం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జనాభా తగ్గిపోతోంది! మరణిస్తున్న జన సంఖ్యతో పోలిస్తే పుట్టుకల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో మరో పాతికేళ్లలోఈ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందనేది ఆ దేశాల బాధ!

ఉదాహరణకు న్యూజిలాండ్ లో జనాభా రేటును గమనిస్తే.. ఆ దేశంలో గత ఏడాదిలో దాదాపు పదిలక్షల మంది పిల్లలు పుట్టారు. ఇదే సంవత్సరంలో ఇక్కడ మరణించిన వ్యక్తుల సంఖ్య చూస్తే దాదాపు 13 లక్షల వరకూ ఉంది! అంటే ఏడాదిలో తగ్గిన  జనాభా దాదాపు మూడు లక్షలు! న్యూజిలాండ్ జనాభా ఏమీ కోట్ల స్థాయిలో లేదు. మొత్తం జనాభా ఉన్నదే 40 లక్షల చిల్లర. మరి ఒక్క ఏడాదిలోనే మూడు లక్షల జనాభా తగ్గిపోతే.. న్యూజిలాండ్ కొన్ని దశాబ్దాల్లోనే మనుషులు లేని దీవిగా మారిపోతుందనేది అక్కడి పాలకులను భయపెడుతున్న అంశం. Readmore!

ఈ విషయంలో మరింత లోతుగా వెళ్లి అధ్యయనం చేయగా.. వంద మందిలో 50 శాతం మంది గత నెల రోజులుగా తాము శృంగారంలో పాల్గొనలేదని చెప్పారట. 19 నుంచి 49 ఏళ్ల మధ్య వయసులోని వారిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించి ఈ విషయాన్ని తేల్చారు. వీరిలో పది శాతం మంది గత రెండేళ్లుగా సంసారానికి దూరంగా ఉన్నారట! మరి ఇలా అయితే పిల్లలు ఎలా పుడతారు?  

కేవలం న్యూజిలాండ్ లో మాత్రమే కాదు, జనాభా క్రమంగా తగ్గిపోతున్న స్థితిలో ఉన్న ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ జనాల శృంగార జీవితాలు కూడా  ఇదే స్థితిలో ఉన్నాయని వివిధ అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎంతమందిని అయినా కనండని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే.. ప్రజలకు మాత్రం ఆ తీరిక లేకుండా పోయిందట!

Show comments