ఎటు వెళ్తున్నాం చంద్రన్న?

ఎక్కడ మొదలైంది.. ఎటు వెళ్తోంది.. చంద్రబాబు పాలన గురించి ఆయన ప్రతిపక్షంలో వినిపించిన మాటలు ఏమిటి? తీరా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏమిటి? 'బ్రింగ్‌ బాబు బ్యాక్‌' అంటే మరేమిటో అనుకున్నాం కానీ.. వ్యవస్థను నాశనం చేయడానికి, పాలన పూర్తిగా గతి తప్పడానికి.. రాష్ట్రం అల్లకల్లోలంగా మారడానికే బాబును మళ్లీ తీసుకొచ్చింది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయిప్పుడు.

తొమ్మిదేళ్ల పాలన అనంతరం.. పదేళ్ల పాటు ఒక గ్యాప్‌ ఏర్పడింది. ఆ గ్యాప్‌లో అంతకు ముందు తొమ్మిదేళ్ల బాబు పాలనను రొమాంటిసైజ్‌ చేశారు తెలుగుదేశం వాళ్లు. బాబు పాలన ఎంతో బాగుండేది.. అంటూ ఐటీ కుర్రాళ్ల మధ్య ఒక ప్రచారాన్ని పుట్టించగలిగారు. అదే ప్రచారాన్ని రైతుల మధ్య, గ్రామాల్లోనూ పుట్టించలేకపోయారు. ఎందుకంటే.. బాబుపాలన ఎలా ఉంటుందో రైతాంగానికి, గ్రామీణాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా వివరించనక్కర్లేని అంశం. అందుకే.. వ్యూహాత్మకంగా ఆ వర్గాలకు రుణమాఫీతో వలవేయడం, పదేళ్ల కాంగ్రెస్‌ పాలనపై కలిగిన వ్యతిరేకత.. అక్కడ తెలుగుదేశం పార్టీకి వరాలుగా మారాయి. 

మరి కట్‌ చేస్తే... చంద్రబాబు పాలన మొదలైంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో.. మూడేళ్ల కిందట చంద్రన్న పాలనలో సీక్వెల్‌ సినిమా మొదలైంది. విభజన తర్వాత అనుభవం కలిగిన పాలకుడు కావాలి.. అందుకే చంద్రబాబు రావాలి.. అని వాదించిన వారితో పాటు.. అన్ని వర్గాలూ బాబు మీద బోలెడన్ని ఆశలతో చూశాయి. అయితే పాలన మొదలైన కొన్ని గంటల్లోనే, ప్రమాణ స్వీకారం జరిగిన అతి తక్కువ సమయంలోనే.. అసలు కథ మొదలైంది.

రుణమాఫీ హామీ కొండెక్కింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మరీ మిమ్మల్ని రుణవిముక్తులం చేస్తామన్న హామీ విషయంలో తెలుగుదేశం తత్తరపాటు మొదలైంది. అర్హుల జాబితా.. ఐదు విడతల్లో మాఫీ, బాండ్లను ఇస్తాం.. వంటి మాటలతో రుణమాఫీని పూర్తిగా అంటే పూర్తిగా నీరుగార్చారు. రుణమాఫీని చేశామని తెలుగుదేశం ప్రభుత్వం ఒకటికి లక్షసార్లు చెప్పుకోవచ్చు గాక.. వాస్తవం ఏమిటో రైతులకు తెలుసు. ఇక డ్వాక్రా రుణమాఫీ సంగతి సరేసరి. మాఫీపై ఆశలతో ఎంతో మంది మహిళలు ఓటు వేయగా.. డ్వాక్రా రుణమాఫీని ప్రహసనంగా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

ఇక ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం గురించి చెబితే దాని గురించి పుంకాను పుంకానులుగా రాసుకొంటూ పోవాలి. కులాల వారీగా ఇచ్చిన హామీలు, అన్నాక్యాంటీన్లు.. ఇలాంటి వెన్నో

Show comments