న్యూ గెటప్..న్యూ కార్

హీరో నాగ శౌర్య కొత్త గెటప్ ట్రయ్ చేస్తున్నాడు. సాయి కొర్రపాటి నిర్మించే థ్రిల్లర్ సినిమా కొసం కొత్త గెటప్ లో కనిపించనున్నాడు. నవంబర్ 15 నుంచి ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇందుకోసం భారీగా గెడ్డం పెంచేసాడు నాగశౌర్య. కొత్త దర్శకుడు రూపొందించే ఈ సినిమా జనవరికి దాదాపు పూర్తి అయిపోతుంది. 

ఇదిలా వుంటే గతంలో వున్న భారీ కారును విక్రయించేసి, నాగశౌర్య కొత్త మోడల్ బెంజ్ కారు కొన్నాడు. తొమ్మిది సెంటిమెంట్ తో 27న రాత్రి డెలివరీ తీసుకున్నాడు. కొటి మూడు లక్షల ఖరీదైన ఈ కార్ సౌత్ ఇండియాలో ఇదే  ఫస్ట్ డెలివిరి అంట. సో కొత్త కారు, కొత్త గెటప్, కొత్త జోనర్ సినిమాతో నాగశౌర్య ఖుషీగా వున్నాడు. 

ఈ సినిమా తరువాత పూరి డైరక్షన్ లో ఒకటి, సుకుమార్ నిర్మాణంలో ఒకటి చేయబోతున్నాడు.ఇదిలా వుంటే నాగశౌర్య సోదరుడి వివాహం వచ్చేనెల 6న విశాఖలో జరగనుంది. అందుకే ఈ హడావుడి కారణంగానే, ఫస్ట్ వీక్ లో ప్రారంభం కావాల్సిన సాయి కొర్రపాటి సినిమాను వెనక్కు జరిపాడు.

Show comments