అల్లు అరవింద్‌ డైరెక్షన్‌లో నిహారిక

హెడ్డింగ్‌లో మిస్టేక్‌ ఏమీ లేదు. అల్లు అరవింద్‌ దర్శకత్వమేమీ చేయడంలేదు. అల్లు అరవింద్‌ సినిమాలో నిహారిక నటించడమూ లేదు. అసలు విషయమేంటంటే, భవిష్యత్తులో నిర్మాతగా అవతారమెత్తనున్న నిహారిక, ఇప్పటినుంచే నిర్మాణానికి సంబంధించిన మెలకువల్ని అల్లు అరవింద్‌ దగ్గరే కాస్తో కూస్తో నేర్చేసుకుందట. టార్గెట్‌ సినీ నిర్మాణమే అయినా, ప్రస్తుతానికి నిహారిక, నటన వైపు దృష్టి సారించింది. వాస్తవానికి బుల్లి తెరపై యాంకర్‌గా అవతారమెత్తకముందే నిహారిక, సినీ నిర్మాణంపై ఆసక్తి పెంచుకుందట.

మెగా కాంపౌండ్‌కి సంబంధించినంతవరకు నాగబాబు, ఒకటీ అరా సినిమాల్లో హీరోగా నటించినా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే మిగిలిపోయాడు. అయితే, నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ వ్యవహారాల్ని చూసుకుంటూ పలు విజయవంతమైన చిత్రాల్ని కూడా ఆయన నిర్మించిన విషయం విదితమే. మెగా బ్యానర్‌ అంటే అందరికీ తెలిసింది అంజనా ప్రొడక్షన్స్‌ గురించే. ఇక, చిరంజీవి సొంత నిర్మాణ సంస్థగా గీతా ఆర్ట్స్‌ కూడా సినీ అభిమానులకు సుపరిచితమే. 

ఇక ఇప్పుడు, గీతా ఆర్ట్స్‌ - అంజనా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా సినిమాలు నిర్మించే అవకాశముందట. నిహారిక నిర్మాతగా కొత్త బ్యానర్‌ని స్థాపించి, గీతా ఆర్ట్స్‌తో కలిసి అంజనా ప్రొడక్షన్స్‌ ఆ సినిమాని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దానికి ఇంకా సమయం వుందనీ, ప్రస్తుతానికి సినిమా నిర్మాణంపై అల్లు అరవింద్‌ వద్ద నిహారిక పాఠాలు నేర్చుకుంటోందనీ సమాచారమ్‌.

అతి త్వరలోనే నిహారిక నిర్మాతగా ఓ మెగా మూవీ సెట్స్‌పైకి రానుంది. హీరో ఎవరన్నదానిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఎందుకంటే మెగా కాంపౌండ్‌లో చాలామంది హీరోలే వున్నారు మరి. ప్రస్తుతానికైతే నిహారిక నటించిన 'ఒక మనసు' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా విడుదలయ్యాకే నిహారిక నిర్మాతగా చేసే సినిమాపై మెగా కాంపౌండ్‌ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  Readmore!

నాగబాబు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినప్పటికీ, సినిమా మార్కెటింగ్‌ విషయంలో మాత్రం అల్లు అరవింద్‌కి మాస్టర్‌ డిగ్రీ వుంది. అదే, నాగబాబు తన కుమార్తెను అల్లు అరవింద్‌ 'స్కూల్‌'లో చేర్పించడానికి ముఖ్య కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

Show comments

Related Stories :