సాహో మొదలైంది

ప్రభాస్ స్వంత బ్యానర్ పై ప్రెస్టీజియస్ గా నిర్మించే సాహొ సినిమా షూటింగ్ సైలెంట్ గా మొదలైపోయింది. అయితే హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాకపోవడంతో, ప్రస్తుతానికి హీరో, హీరోయిన్ తో సంబంధం లేని సీన్లు తీస్తున్నారు.

ఆర్ ఎఫ్ సి, సెంట్రల్ లైబ్రరీ తదితర ప్రాంతాల్లో రెండు రోజులుగా షూట్ జరుగుతోంది. విలన్ ముఖేష్ తదితరులు షూట్ లో పాల్గొంటున్నారు.

రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ రెండో సినిమా ఇది. హీరోయిన్ డైలమా ఇంకా తేలలేదు. అనుష్క పేరు బలంగా వినిపిస్తోంది. అనుష్క కాదు అని ఎవరూ ఖండించడం కూడా లేదు. మరోపక్క బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

బాహుబలి తరువాత ఆ రేంజ్ లో వుండాలని ఈ సినిమాపై ప్రభాస్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఫారిన్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు టోటల్ ప్రాజెక్టు ఇచ్చేయమంటూ మూడు వందల యాభై కోట్ల మేరకు ఆఫర్లు వచ్చాయి కూడా.

Show comments