లిప్‌ టు లిప్‌ ముద్దు వెనుక కథ.!

హీరోయిన్లను లిప్‌ టు లిప్‌ కిస్‌ గురించి మాట్లాడమంటే కథలు కథలుగా చెప్పేస్తారు. బాలీవుడ్‌లో ఈ కథలు చాలా ఎక్కువ. మన సౌత్‌లో అయితే, చాలా అరుదుగా మాత్రమే లిప్‌ కిస్‌ సీన్స్‌ కన్పిస్తాయనుకోండి.. అది వేరే విషయం. బాలీవుడ్‌లో లిప్‌ కిస్‌లకి ఓ స్పెషలిస్ట్‌ హీరో వున్నాడు. అతనే ఇమ్రాన్‌ హష్మీ. లిప్‌ కిస్‌ అన్న మాట వస్తే, ఏ హీరోయిన్‌ అయినా అతని ప్రస్తావన తీసుకురావాల్సిందే. అఫ్‌కోర్స్‌.. ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాల్లో లిప్‌ టు లిప్‌ కిస్‌ చాలా చిన్న విషయమైపోయిందనుకోండి.. అది వేరే విషయం. 

తాజాగా, హీరోయిన్‌ మంజరి ఫడ్నిస్‌ 'జీనా ఇసీ కా నామ్‌ హై' అనే సినిమాలో నటించింది. ఆ సినిమా రేపే విడుదలవుతోంది. ఇందులో హీరో హిమాన్ష్‌ కోహ్లీతో గాఢంగా లిప్‌ టు లిప్‌ కిస్‌ లాగించేసింది మంజరి. షరామామూలుగానే ఆ సీన్‌ కథలో చాలా ఇంపార్టెంట్‌ అనీ, అందుకే లిప్‌ టు లిప్‌ కిస్‌ చేయాల్సి వచ్చిందనీ మంజరి చెప్పుకొచ్చింది. అన్నట్టు, లిప్‌ టు లిప్‌ కిస్‌ అంటే అందరూ అనుకునేంత 'గాఢం'గా వుండదనీ, ఎక్కువగా ఇలాంటి సీన్స్‌ వీలైనంత వేగంగా ముగించేస్తారనీ చెబుతోంది మంజరి ఫడ్నిస్‌. 'జీనా ఇసీ కా నామ్‌ హై' సినిమాలో తాను చేసిన లిప్‌ కిస్‌ సీన్‌ కూడా అలాంటిదేనంటున్న మంజరి, ఒక్క టేక్‌లోనే ఆ సీన్‌ పూర్తి చేసిందట. తెరపై మాత్రం చాలా గాఢంగా కన్పిస్తుందట ఆ సీన్‌. 

తెలుగులో 'సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం', 'శుభప్రదం', 'ఇంకోసారి' తదితర సినిమాల్లో నటించిన మంజరి, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతోపాటు, బెంగాలీ సినిమాల్లోనూ నటించేసింది. హీరోయిన్‌గా ఇన్ని భాషల్లో నటించినా స్టార్‌డమ్‌ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ విలక్షణ పాత్రల్ని ఎంచుకోవడానికి ప్రాధాన్యతనిచ్చానే తప్ప, ఎక్కువగా కమర్షియల్‌ సినిమాల గురించి ఆలోచించకపోవడం వల్లేనని చెప్పింది మంజరి.

Show comments