సమంత 90, నాగచైతన్య 161

సమంత వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ అయిపోతుందేమో.. సమంత మాత్రమే కాదు, అక్కినేని నాగచైతన్య కూడా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సత్తా చాటేస్తాడేమో.! సీరియస్‌గా కాదు, జస్ట్‌ సరదాగా అంతే.! అయితే, 'లిఫ్టింగ్‌' మాత్రం నిజం. ఫొటోలు చూస్తోంటే అర్థమవట్లేదా.? ఇద్దరూ ఎంత సీరియస్‌గా వెయిట్‌ లిఫ్టింగ్‌ చేసేస్తున్నారో.! 

హీరో హీరోయిన్లన్నాక శరీరాన్ని ఫిట్‌గా వుంచుకోవాలి. అరకిలో బరువు ఎక్కువవకూడదు, అరకిలో బరువు తక్కువవకూడదు. ఎంత ఫిట్‌గా వుంటే, అంత మంచిది హీరో హీరోయిన్లకి. దాదాపుగా ప్రముఖ హీరో హీరోయిన్లంతా సొంతంగా ఫిట్‌నెస్‌ స్టూడియోలని ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇది కూడా బహుశా అలాంటిదే కావొచ్చు. 

సమంత ఏకంగా 90 కిలోల బరువుని లిఫ్ట్‌ చేసేస్తే, నాగచైతన్య తక్కువేం తిన్లేదు.. 161 కిలోల బరువుని లిఫ్ట్‌ చేసేశాడు. త్వరలో ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతోన్న విషయం విదితమే. వెయిట్‌ లిఫ్టింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడానికి, నాగచైతన్యని రిక్వెస్ట్‌ చేసి పర్మిషన్‌ సాధించేసిందట. అలా వెలుగు చూశాయి ఈ వెయిట్‌ లిఫ్టింగ్‌ వ్యవహారాలు.

Show comments