1 నే జనతా గ్యారేజ్ ?

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న జనతా గ్యారేజ్ విడుదల ఓ రోజు ముందుకు జరిగేలా వుంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికి పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోంది. 26కు ఫస్ట్ కాపీ చేతికి వస్తుంది. 27 లేదా 28 సెన్సార్. సో, 2 నుంచి వాయిదా పడడడానికి పెద్దగా అవకాశం కనిపించడం లేదు. కానీ 2వ తేదీకి  బదులుగా ఒకటవ తేదీకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

దేశ వ్యాప్తంగా వామపక్షాలు 2న బంద్ పిలుపు ఇచ్చాయి.  వామపక్షాల బంద్ కాబట్టి, ఆంధ్ర, తెలంగాణల్లో పెద్దగా పట్టించుకోనక్కరలేదు. అయితే కేరళలో వామపక్షాలు కాస్త బలంగానే వున్నాయి. అక్కడ సమ్మె సక్సెస్ కావడం గ్యారంటీ. జనతా గ్యారేజ్ లో మళయాల నటుడు మోహన్ లాల్ కీలక పాత్ర ధారి. పైగా ఈ సినిమా కేరళ హక్కులు ఆయనవే. అక్కడ ఆయనే విడుదల సన్నాహాలు చేసుకుంటున్నారు. 

అందువల్ల బంద్ ఆయనకు ఎఫెక్ట్ ఇచ్చే ప్రమాదం వుంది. సో, ఆయన కోసం అంటే మళయాల వెర్షన్ కోసం డేట్ ను ఓ రోజు ముందుకు జరపాలని ఆలోచిస్తున్నారు. అయితే అసలు బంద్ వుంటుందా? వుండదా? అన్నదానిపై ఓ రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఆ క్లారిటీ వచ్చేస్తే, గ్యారేజ్ ఓపెనింగ్ డేట్ పై క్లారిటీ వస్తుంది.

Readmore!
Show comments

Related Stories :