అఖిల్ సినిమాలో ఛాన్స్ మిస్.. ఒకే ఒక్క కారణం..!

ఒంటినిండా అందం ఉండొచ్చు. ఎంత కష్టాన్నయినా భరించే ఓర్పు ఉండొచ్చు. కానీ ఆవగింజంత అదృష్టం లేకపోతే ఎవడూ ఏం చేయలేడు. ముద్దుగుమ్మ సాయేషాకు ఆ ఆవగింజంత అదృష్టమే తగ్గింది. అందుకే అఖిల్ తో మరోసారి నటించే అవకాశాన్ని కోల్పోయింది. కేవలం సెంటిమెంట్ యాంగిల్ తోనే సాయేషాను తప్పించారు. నిజంగా బ్యాడ్ లక్.

అక్కినేని అఖిల్ ఫస్ట్ మూవీలో సిసింద్రీ-సాయేషా జోడీ అదిరిపోయింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగానే పండింది. సాయేషా లుక్స్, డాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. కానీ అఖిల్ మూవీ పెద్ద డిజాస్టర్. ఆ ఎఫెక్ట్ ఆమెకు అఖిల్ సరసన నెక్ట్స్ ఛాన్స్ రాకుండా చేసింది. అఖిల్ సినిమా డిజాస్టర్ అయింది కాబట్టి.. సెంటిమెంట్ కొద్దీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ఆమెను సెలక్ట్ చేయలేదు. పైగా సెకెండ్ ప్రాజెక్టుపై అఖిల్ సినిమా ఛాయలు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట.

అఖిల్ సినిమా ప్రభావం ఎవరిపై ఎంత పడిందో చెప్పలేం కానీ, సాయేషాపై మాత్రం చాలా గట్టిగా పడింది. ఆ సినిమా దెబ్బకు ఇప్పటివరకు మరో తెలుగు సినిమా అవకాశం రాలేదామెకు. ప్రస్తుతం జయం రవి సరసన ఓ తమిళ సినిమా చేస్తోంది ఈ చిన్నది. మరోవైపు అఖిల్ సినిమా కోసం అలియాభట్ ను ట్రై చేస్తున్నట్టు టాక్.

Show comments