మెగాస్టార్ కన్నా.. హీరోయిన్ పారితోషకమే ఎక్కువ!

ఇప్పటికే సంపాదన విషయంలో ఫోర్బ్స్ జాబితాలో హాలీవుడ్ నటీమణులతో పోటీ పడుతోంది  దీపికా పదుకునే. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తూ.. ఇప్పుడిప్పుడు హాలీవుడ్ లో కూడా కెరీర్ ను ఆరంభించిన దీపిక పారితోషకం గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్. దీపికతో “పికూ’’ సినిమాలో కలిసి నటించిన ఆయన ఆ సినిమాకు తన కన్నా దీపిక ఎక్కువ పారితోషకం తీసుకుందని వ్యాఖ్యానించాడు!

భారతీయ ఇండస్ట్రీలు ప్రధానంగా హీరో స్వామ్యాలు.. ఎంతటి స్టార్ హీరోయిన్ కి అయినా.. ఆమె సరసన నటించే సాధారణ హీరో కన్నా తక్కువ పారితోషకం పొందుతుంది. వరస ప్లాఫుల్లో ఉన్న హీరో తో వరస విజయాల్లో ఉన్న హీరోయిన్ నటించినా.. అతడి స్థాయిలో సగం పారితోషకాన్ని పొందడం కూడా కష్టమే!

అయితే  ఈ పరిస్థితుల్లో కొంతమంది హీరోయిన్లు మార్పులు తీసుకొస్తున్నారని అనడానికి కూడా అమితాబ్ వ్యాఖ్య లు నిదర్శనం. ఏకంగా మెగా స్టార్ తో పాటు నటించి.. ఆయన కన్నా ఎక్కువ పారితోషకం తీసుకుంది దీపిక. “పికూ’’ సినిమాలో తన కన్నా దీపికది ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర అని.. అందుకే ఆమెకు ఎక్కువ పారితోషకం దక్కిందని బిగ్ బి హుందాగా వ్యాఖ్యానించారు. 

Show comments