మాజీ భార్య, మాజీ గర్ల్ ఫ్రెండ్స్.. అంతా టచ్ లోనే!

తన రిలేషన్ షిప్స్ గురించి చాలా ఓపెన్ గా చెప్పాడు సుమంత్. కీర్తీ రెడ్డిని వివాహం చేసుకుని విడాకులు తీసుకుని సింగిల్ గా ఉంటున్న ఈ హీరో గత ప్రేమ బంధాల గురించి వివరించాడు. ఫస్ట్ క్రష్ దగ్గర నుంచి మాజీ ప్రేయసులతో ప్రస్తుత బంధం వరకూ అన్నింటి గురించి చెప్పాడు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మాజీ భార్య కీర్తీ రెడ్డితో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలే ఉన్నాయని చెప్పడం. తాము గొడవ పడి, తిట్టుకుని, కొట్టుకుని విడిపోయిందేమీ లేదని, విడాకుల అనంతరం ఆమె మరో వివాహం చేసుకుని బెంగళూరులో సెటిలయ్యిందని.. ఇప్పటికీ తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని సుమంత్ వివరించాడు. భార్యభర్తలుగా గాక ఇప్పుడు తాము స్నేహితులుగా కొనసాగుతున్నామని అన్నాడు.

కేవలం కీర్తీతోనే కాదు.. అంతకు ముందు యూఎస్ లో ఏడేళ్ల పాటు ప్రేమబంధాన్ని గడిపానని.. ఒక ఎన్ఆర్ఐ గర్ల్ తో అనుబంధం ఉండేదని.. ఇండియా వచ్చేయడంతో ఆమెతో బ్రేకప్ అయ్యిందని.. తను కూడా ఇప్పుడు తనకు మంచి స్నేహితురాలే అని సుమంత్ చెప్పాడు.

ఇక వర్తమానం సంగతేమో కానీ.. గతంలో గర్ల్ ఫ్రెండ్స్ ఉండే వాళ్లు అని, భవిష్యత్తులో ఉంటారేమో.. అని అన్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మరోసారి స్పష్టం చేశాడు. సింగిల్ ఉండటంలోని కంఫర్ట్ నెస్ కు అలవాటు పడిపోయానని వివరించాడు.  Readmore!

Show comments