బురద చల్లేశాం జగన్ .. ఇక వదిలించుకో!

జగన్ విషయంలో రౌండ్  ఫిగర్ స్థాయిని తగ్గించింది తెలుగుదేశం పార్టీ. స్వయంగా చంద్రబాబు నాయుడు ఈ ప్రచారంలో పాలు పంచుకున్నాడు. తన భజంత్రీ మీడియాకు ఇచ్చిన ఫుల్ పేజీ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన నల్లధనం అంశం గురించి అనుమానాస్పదమైన రీతిలో మాట్లాడాడు. మొత్తం వెలుగులోకి వచ్చిన పన్నెండు వేల కోట్ల రూపాయల మొత్తంలో పది వేల కోట్ల రూపాయలు ఒకే వ్యక్తివి అని బాబు చెప్పుకొచ్చాడు.

అయితే ఉదయానికి ఆ విధంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ మధ్యాహ్నానికి ఆ వ్యక్తి జగన్ అని తేల్చి చెప్పింది. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ జగన్ పదివేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నాడని ఒక రాయి వేసేశాడు!

ఇలా బురద చల్లేస్తే పోయేదేముంది.. మొదట చంద్రబాబు, తర్వాత దేవినేని.. వీరి తర్వాత మిగతా వాళ్లు. పాడిందే పాడుతుంటే చాలు. ఇలాంటి కబుర్లు వినడానికి కూడా బాగుంటాయి కదా! లక్ష కోట్ల రూపాయల విషయంలో జరిగిన ప్రచారం విజయవంతం అయినట్టే లెక్క. మరి ఇప్పుడు అందులో పదో వంతు.. నంబర్ తో ప్రచారం మొదలుపెట్టారు.

ట్రావెన్ కోర్ రాజుల ఆస్తులు.. పనామా పేపర్లు..  ఇలా తెరపైకి ఏది వచ్చినా అందులో జగన్ కు భాగస్వామ్యాన్ని కలుపుతూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ పరంపరలో ఇప్పుడు నల్లధనం వెల్లడి పథకం లో కూడా జగన్ ను ఇన్ వాల్వ్ చేసి బురదజల్లేసింది. ఇక దీన్ని వదిలించుకునే బాధ్యత జగన్ దనమాట!

Show comments