'ధృవ' ఛాలెంజ్‌కి రెడీనా.?

పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత వస్తున్న తొలి పెద్ద సినిమా 'ధృవ'. ఈ నెల 9న 'ధృవ' ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్న సినిమాలు రిస్క్‌ చేసి ఎలాగోలా విడుదలవుతున్నాయి. అందులో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వెరీ స్పెషల్‌ ఫలిం అయ్యింది. నోట్ల రద్దు సంక్షోభాన్ని బాగానే ఎదుర్కొంది ఆ సినిమా. చిన్న సినిమాలతో పోల్చితే, పెద్ద సినిమాలకే అతి పెద్ద పరీక్ష ఇప్పుడు. ఆ పరీక్షనే 'ధృవ' ఎదుర్కోబోతోంది. 

పెద్ద సినిమా అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బెనిఫిట్‌ షో. దీనికోసం పెద్దమొత్తాల్లో వసూలు చేసేస్తుంటారు. 1000 రూపాయల నుంచి 3 వేల రూపాయలదాకా ఒక్కోసారి ఈ బెనిఫిట్‌ షో టిక్కెట్ల ధరలు పలుకుతుంటాయి. రామ్‌చరణ్‌ గతంలో నటించిన సినిమాల బెనిఫిట్‌ షోలు ఈ స్థాయిలోనే ప్రేక్షకుల జేబుల్ని పిండేశాయి. మరి, ఈసారేమవుతుంది.? 

మార్కెట్‌ పెద్ద కొత్త నోట్లు కాదు కదా, అసలు నోట్లే దొరకని పరిస్థితి. తీవ్రమైన సంక్షోభమే నెలకొంది. ఈ పరిస్థితుల్లో ముందుగా ఎఫెక్ట్‌ పడేది బెనిఫిట్‌ షోలకే. ఓపెనింగ్స్‌ వరకూ 'ధృవ' టీమ్‌ చాలా ధీమాగానే వుంది. బెనిఫిట్‌ షోల్ని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం టాలీవుడ్‌లో మామూలే. మరి, 'ధృవ' బెనిఫిట్‌ షోలు ఏం చేస్తాయి.? ఏ స్థాయిలో 'ధృవ' బెనిఫిట్‌ షో టిక్కెట్‌ పలుకుతుంది.? ఏమో, వేచి చూడాల్సిందే.

Show comments